గిరిజనుడికి మేయర్ పదవి: కూనంనేని సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం చోటు చేసుకుంది.

గిరిజనుడికి మేయర్ పదవి: కూనంనేని సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా కొత్తగూడెం కార్పొరేషన్‌(Kothagudem Corporation)లో సీపీఐ పార్టీ సత్తా చాటింది. కొత్తగూడెం కార్పొరేషన్‌లోని అత్యధిక వార్డుల్లో విజయం సాధించింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు రెడీ అయింది. తాజాగా ఫలితాలపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) మాట్లాడారు. కొత్తగూడెంలో ప్రజలు సీపీఐని ఆదరించారు. కేటీఆర్ కూడా ఫోన్ చేసి మద్దతు ఇచ్చారు. ఇండిపెండెంట్లు కూడా మద్దతు ఇస్తున్నారు. మేయర్ పదవిని కైవసం చేసుకుంటాం. ఇప్పటివరకు మేము కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలు చేయలేదు. జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తాం. మేయర్ పదవిని గిరిజనులకే ఇస్తామని కూనంనేని సంచలన ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే.. సీపీఐ ఏకైక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇలాఖాలో ఆ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోనుండటంతో.. ఆ పార్టీ వర్గాల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

Next Story