ఆ ఒక్క మాటతో.. కేసీఆర్‌ క్రెడిబిలిటీ మొత్తం పోయింది: CPI MLA కూనంనేని

by Gantepaka Srikanth |

అసెంబ్లీకి వచ్చి మీ భావాలు చెప్పండి అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌(KCR)కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు(Kunamneni Sambasiva Rao) సూచించారు.

ఆ ఒక్క మాటతో.. కేసీఆర్‌ క్రెడిబిలిటీ మొత్తం పోయింది: CPI MLA కూనంనేని
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీకి వచ్చి మీ భావాలు చెప్పండి అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌(KCR)కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు(Kunamneni Sambasiva Rao) సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో అయితే కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ మాట్లాడొచ్చు.. ప్రభుత్వాన్ని విమర్వించొచ్చు అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లు కాళేశ్వరానికి అన్ని తానే అని చెప్పుకున్న కేసీఆర్.. అధికారం కోల్పోగానే తనకు సంబంధం లేదని చెప్పడంతో కేసీఆర్ క్రెడిబిలిటీ మొత్తం పోయిందన్నారు. కేటీఆర్ ప్రెస్ క్లబ్ వెళ్లి కుర్చున్నారని, ప్రెస్ క్లబ్‌కు వెళ్లడం సమస్యను పక్కదారి పట్టించడమే అన్నారు. కాళేశ్వరం, బనకచర్ల రెండు సీరియస్ అంశాలే అన్నారు. ఈ రెండు అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీకి ఎందుకు రారు అని ప్రశ్నించారు. ఈ రెండు అంశాలు న్యాయ వ్యవస్థ పరిధిలోకి వెళ్లాయన్నారు. అయినా బీఆర్ఎస్ నేతలు సవాల్ చేయడాలు.. కమిషన్ ఎదుట హాజరయ్యే ముందు వందల కార్లతో హడావుడి చేయడం ఎందుకని మండిపడ్డారు.

ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అన్నారు. నీటి వాటాలు తేలే వరకు బనకచర్ల ప్రాజెక్టు ఆపాల్సిందేనని కూనంనేని సాంబశివ రావు అన్నారు. మీ వాటా నీళ్లు మీరు తీసుకొంది, మా వాటా నీళ్లు మావి అని అన్నారు. జల సంఘం నీటి వాటాలు తేల్చాలన్నారు. నీటి వాటాలు తేలకుండానే ప్రాజెక్టులు కట్టడం కరెక్టు కాదన్నారు. భద్రచలంలో ఈఓపై దాడి జరిగిందన్నారు. ఈ ఐదు ఊర్లను తెలంగాణకు వదిలేయలన్నారు. చంద్రబాబు బాధ్యత తీసుకోవాలన్నారు. ఐదు గ్రామాలను వదిలేయలన్నారు. మీరు, మేము కలిసి ఉండొచ్చు అన్నారు.

Next Story