ఆందోళన చేయాల్సిన మేము చేతులు ముడుచుకోవాల్సి వస్తోంది: సీపీఐ MLA కూనంనేని

by Gantepaka Srikanth |

సభలో ప్రజల సమస్యలు పక్కదారి పట్టించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు వాడుతూ బీజేపీ సభ్యులు గందరగోళం చేస్తున్నారని సీపీఐ శాసన సభ్యులు కూనం నేని సాంబశివరావు పేర్కొన్నారు.

ఆందోళన చేయాల్సిన మేము చేతులు ముడుచుకోవాల్సి వస్తోంది: సీపీఐ MLA కూనంనేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: సభలో ప్రజల సమస్యలు పక్కదారి పట్టించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు వాడుతూ బీజేపీ సభ్యులు గందరగోళం చేస్తున్నారని సీపీఐ శాసన సభ్యులు కూనం నేని సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం అసెంబ్లీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ పలు శాఖల పనితీరుపై చురకలు వేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని, ఆర్థికశాఖ వద్దకు రాగానే పనులు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో నిధులు ఎక్కువ వస్తున్నాయనే ప్రచారం సరికాదని, ముగ్గురు మంత్రులకే వస్తున్నట్లు ఉందని, తన నియోజకవర్గానికి ఏమాత్రం నిధులు రావడం లేదని, అభివృద్ది జరగడం లేదని ప్రజలు ఎక్కడిక్కడే నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్​పార్టీతో పొత్తు ఉండటంతో గట్టిగా ప్రశ్నించలేకపోతున్నామని, ఆందోళన చేయాల్సిన తాము చేతులు ముడుచుకుని ఉండాల్సి వస్తోందన్నారు. అసమర్థ నాయకులుగా విమర్శలు వస్తున్నాయని, ప్రజలకు వద్దకు వెళ్లాలంటే వెనకడుగు వేయాల్సి వస్తోందన్నారు.

మంత్రులు మధ్య సమన్వయం లేదని, ఒకరి ప్రతిపాదనలు పంపితే మరో మంత్రి పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాను రెండున్నర ఏళ్లుగా మంత్రులు చుట్టూ తిరిగి ఆలసిపోతున్నామని, పనులు కావడం లేదన్నారు. రాష్ట్రంలో వైద్య రంగం నిర్లక్ష్యానికి గురైతుందని, ప్రాథమిక కేంద్రాల్లో వైద్యలు, నర్సులు, మందులు అందుబాటులో లేవని, పేదలు కార్పరేట్​ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. అదే విధంగా విద్య రంగం పరిస్థితి ఏమాత్రం బాగా లేదని, సరిపడ పాఠశాలలు లేవని, విద్యార్ధులు లేని చోట స్కూళ్లు ఉండటంతో ఉన్నచోట లేకపోవడం బాధకరమన్నారు. సింగరేణి ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని, పెండింగ్​పెట్టడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో మంది పదవి విరమణ చేస్తే ఇప్పటివరకు వారికి రావాల్సి బెనిఫిట్​చెల్లించకపోవడం ఆత్మహత్యకు పాల్పడుతున్నరని పేర్కొన్నారు. ఏ రంగం చూసినా అభివృద్ధి ముందుకు సాగడం లేదన్నారు. రాష్ట్ర ఎందుకు ప్రజలకు అభివృద్ది చేయడంలో వెనబడిందో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చేసి పేదల సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు.

Next Story