ప్రభుత్వానికి ఏడాది సమయమిద్దాం.. విపక్షాలను MLA కూనంనేని విజ్ఞప్తి

by Disha Web Desk 2 |
ప్రభుత్వానికి ఏడాది సమయమిద్దాం.. విపక్షాలను MLA కూనంనేని విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్టంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఒక సంవత్సరం సమయం ఇద్దామని ప్రతిపక్ష పార్టీలకు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌‌పై జరిగిన చర్చలో కూనంనేని పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తారనే విశ్వాసం తనకుందన్నారు. కాకపోతే రెవెన్యూ ఖర్చును తగ్గించుకొని మూల దన వ్యయాన్ని పెంచుకునే విధంగా కృషి చేస్తే ఎలాంటి లోటు లేకుండా ఉంటుందని, ఈ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి కనీసం రెండునెలలు అయిందని కాస్త కుదుట పడిన తర్వాత హామీల అమలు కోసం డిమాండ్ చేద్దామన్నారు.

అసంఘటిత రంగాల్లో వున్నా కార్మికులకు పీఎఫ్ అందేలా చూడాలన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండేలా చూడాలని కోరారు. వైద్యం, విద్య ఉచితంగా అందించాలన్నారు. రాష్టంలో ఎంతమంది పేదవారున్నారు..? ఎంతమందికి ఇల్లు లేవు.. కాంట్రాక్టు ఉద్యోగులెందరున్నారు. ఎంతమంది కార్మికులు పని చేస్తున్నారు.. అవుట్ సోర్సు ఉద్యోగులు.. ఎంతమంది వున్నారో లెక్కలు తీయాలన్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాలో విచ్చలవిడిగా భూకబ్జాలు జరిగాయని వీటిపై ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు కనీసం ఇల్లు ఉండేలా చూడాలన్నారు.


Next Story

Most Viewed