మాయమాటలు నమ్మితే బతుకులు ఆగమే...

by Disha Web Desk 15 |
మాయమాటలు నమ్మితే బతుకులు ఆగమే...
X

దిశ, పటాన్ చెరు : మాయ మాటలు నమ్మితే.. మన బతుకులు ఆగమవుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారంలో భాగంగా కిష్టారెడ్డిపేట దుర్గమ్మ గుడి సమీపంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ, అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీలు కల్లబొల్లి మాటల ద్వారా ఈ ఎన్నికలలో మన ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు.

ఆ రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతోనే బయటకు వచ్చిన కేసీఆర్ టీవీలలో ఇంటర్వ్యూలు, యాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అదే అసెంబ్లీకి వచ్చి మంచి పనుల కోసం కాంగ్రెస్ కు ఆదేశాలు ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించారు. ఒక్కసారి ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, అమీన్ పూర్ మండల అధ్యక్షులు దొంతి అశోక్, మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్ ముఖ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed