బిగ్‌బాస్ నేహకు ప్రమాదం.. హెల్త్ అప్డేట్ ఇస్తూ కన్నీరు పెట్టుకుంటున్న వీడియో షేర్ చేయడంతో ఆందోళనలో ఫ్యాన్స్

by Disha Web Desk 6 |
బిగ్‌బాస్ నేహకు ప్రమాదం.. హెల్త్ అప్డేట్ ఇస్తూ కన్నీరు పెట్టుకుంటున్న వీడియో షేర్ చేయడంతో ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ బ్యూటీ నేహా చౌదరి గత కొద్ది కాలంగా నీతోనే డాన్స్ షోలో నటుడు విశ్వతో కలిసి ఫర్మార్మెన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో పాపులారిటీ పెంచుకుంటుంది. పలు ఎపిసోడ్స్‌లో జోడిగా డాన్స్ చేసి స్టేజీపై దుమ్మరేపింది. అయితే నేహా ఇటీవల విడుదలైన ప్రోమోలో మెడకు పట్టి వేసుకుని వచ్చి షో నుంచి తప్పుకుంటున్నట్లు సడెన్‌గా చెప్పి షాకిచ్చిన విషయం తెలిసిందే.

దీంతో ఇంత సడెన్‌గా నేహా ఎందుకు తప్పుకుందని ఫ్యాన్స్ కంగారు పడిపోయారు. ఆమెకు ఏమైందోనని సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ చేశారు. ఈ క్రమంలో.. తాజాగా, నేహ తనకు అయిన గాయం గురించి చెబుతూ ఓ వీడియో షేర్ చేసింది. ‘‘డాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు గాయం అయింది. ఇప్పటికే చాలా ఇంజ్యూరీలు కావడంతో దీనిని కూడా.. మొదట లైట్ తీసుకుని డాన్స్ చేశాను. కానీ రోజు రోజుకు నొప్పి పెరగడంతో తట్టుకోలేక హాస్పిటల్‌కు వెళ్లాను. దీంతో వాళ్లు చెక్ చేసి డాన్స్ చేయడంతో ఎఫెక్ట్ అయిందని చెప్పారు.

అలాగే మూడు వారాలు మెడకు బెల్ట్ పెట్టుకుని కదలకుండా కూర్చోవాలి, పడుకోవాలి అని చెప్పారు. అయినప్పటికీ గాయం తగ్గకపోతే.. సర్జరీ చేస్తామని అన్నారు. అందుకే డాన్స్ షోలో పాల్గొనలేక పోతున్నాను. నా వల్ల విశ్వ కూడా జోడి లేకపోవడంతో.. షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అందుకే నాకు చాలా బాధగా అనిపిస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా వీడియోలోనే కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం నేహా షేర్ చేసిన కామెంట్స్ తెలిసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అలాగే తొందరగా కోలుకొని మళ్లీ డాన్స్ షో లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.




Next Story

Most Viewed