స్వలింగ సంపర్కులకు షాక్.. ఇక అలా చేస్తే జైలు శిక్ష

by Disha Web Desk 12 |
స్వలింగ సంపర్కులకు షాక్.. ఇక అలా చేస్తే జైలు శిక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోని పలు దేశాల్లో రోజు రోజుకు స్వలింగ సంపర్కులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమకు ప్రత్యేక హక్కులు కల్పించాలని తమ వివాహాలకు కూడా అధికారికంగా గుర్తించాలని పలు కీలక దేశాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెళ్లు వెత్తాయి. దీంతో పలు దేశాలు తమ సంస్కృతి పై తీవ్ర ప్రభావం పడుతుందని.. వారిని హెచ్చరించాయి. కానీ వారు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరాక్ ప్రభుత్వం లెస్బియన్స్‌కు షాక్ ఇచ్చింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా గుర్తించే బిల్లును ఇరాక్ పార్లమెంట్ ఆమోదించింది. దీంతో తమ దేశంలో స్వలింగ సంపర్కం చేసే వారికి 10-15 సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నారు. అలాగే గుర్తించబడిన ట్రాన్స్ జెండర్లకు 1-3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. కాగా ఇరన్ తమ దేశంలోని మతపర విలువలను కాపాడేందుకు ఈ కొత్త చట్టం సహాయపడుతుందని భావిస్తుంది. కాగా ఇరాన్ తెచ్చిన ఈ కొత్త చట్టం ఎల్జీబీటీ హక్కులకు భంగం కలిగించేలా ఉందని.. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అలాగే దీనిపై పోరాటానికి వారు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed