- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLA Kunamneni : రంగరాజన్ కు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని పరామర్శ!
రామరాజ్యం ఆర్మీ వ్యవస్థపకుడు వీరరాఘవరెడ్డి దాడికి గురైన చిలుకూరు బాలాజీ దేవాలయ(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్(Chief Priest Rangarajan) ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(CPI MLA Koonamneni Sambasiva Rao) పరామర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : రామరాజ్యం ఆర్మీ వ్యవస్థపకుడు వీరరాఘవరెడ్డి దాడికి గురైన చిలుకూరు బాలాజీ దేవాలయ(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్(Chief Priest Rangarajan) ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(CPI MLA Kunamneni Sambasiva Rao) పరామర్శించారు. రంగరాజన్ కు ధైర్యం చెప్పి మేమంతా అండగా ఉన్నామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూనంనేని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ దాడితో దుండగుల దీనత్వం..మీ ఔన్నత్యం అందరికి అర్ధమైందన్నారు.
మీరు అంతకుముందు చేసిన మంచి పనులు వెలుగులోకి వచ్చాయని..ఓ దళితుడిని ఎత్తుకుని గుడిలోకి తీసుకెళ్లడం స్ఫూర్తిదాయకమన్నారు. రామరాజ్యం ఆర్మీ పేరుతో దాడులకు పాల్పడుతున్న వారు నిజమైన రామభక్తులు కారని..వారు సూడో భక్తులని విమర్శించారు. మీరే నిజమైన రామభక్తులు..దైవ భక్తులని..ఇంకా చెప్పాలంటే నిజమైన హిందువు దేశ భక్తులని.. మీరు కూడా అలాంటి వారేనని రంగరాజన్ ను కూనంనేని అభినందించారు.
రామరాజ్యం ఆర్మీ దాడికి గురైన చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కు సీఎం రేవంత్ రెడ్డి సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు అంతా కూడా రాజకీయాలకు అతీతంగా పరామర్శించారు. రంగరాజన్ ను నిత్యం ఎందరో ప్రముఖులు పరామర్శిస్తూ ధైర్యం చెబుతున్నారు. మరోవైపు రంగరాజన్ పై దాడికి పాల్పడిన రామరాజ్యం ఆర్మీ వ్యవస్థపకుడు వీరరాఘవరెడ్డి సహా ఆయన బృందం సభ్యులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. రంగరాజన్ పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.






