Kunamneni: కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం కుదరడం లేదు

by Gantepaka Srikanth |

ప్రభుత్వం పనులు చేస్తున్నా ప్రజలు ఎందుకో నమ్మడం లేదని సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు.

Kunamneni: కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం కుదరడం లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం పనులు చేస్తున్నా ప్రజలు ఎందుకో నమ్మడం లేదని సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రజల కోసం పథకాలు అమలు చేస్తున్నా ప్రజల్లో పెద్దగా నమ్మకం కుదరడం లేదన్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అమలు చేయలేని హామీలు ఇచ్చిందని.. వాటన్నింటినీ అమలు చేయకపోవడం వల్లనే ప్రజల్లో ఆ వ్యతిరేకత కనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. పడిపోతున్న ప్రభుత్వాన్ని తాము వెన్నంటి ఉంటూ నిలబెడుతున్నామని వ్యాఖ్యానించారు. మిత్రపక్షంగా ఉంటూ తమ టాస్క్‌ను తాము నిర్వహిస్తున్నామని చెప్పారు.

Next Story