- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సురవరం సుధాకర్ రెడ్డికి మావోయిస్టుల నివాళి! విప్లవ పోరాటాలపై ప్రత్యేకంగా కొనియాడిన మావోయిస్టు పార్టీ
సీపీఐ అగ్రనేత, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూతపై సీపీఐ (మావోయిస్టు) పార్టీ నివాళి అర్పించింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సీపీఐ అగ్రనేత, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూతపై సీపీఐ (మావోయిస్టు) Communist Party of India (Maoist) పార్టీ నివాళి అర్పించింది. ఈ మేరకు సోమవారం సీపీఐ (మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ (Central Committee Spokesperson Abhay) పేరిట ఒక ప్రకటన విడుదల అయింది. 1942 లో జన్మించిన సురవరం సుధాకర్‌రెడ్డి జీవితాంతం వామపక్ష రాజకీయాలకు, పీడిత ప్రజల సమస్యలపై పోరాటానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఆయనకు (సీపీఐ) మా పార్టీ విప్లవ సంథా, ఎత్తుగడలపై పూర్తి భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ విప్లవ ప్రజా సంఘాలతో ప్రజాసమస్యల మీద ఎన్నో ఐక్య కార్యాచరణలలో, ఐక్య సంఘటనలలో కలిసి పని చేశారని వెల్లడించారు. రాజ్యం తన ఉక్కు పాదాన్ని మోపి విప్లవోద్యమంపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించినప్పుడు ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో బూటకపు ఎన్ కౌంటర్లలో విప్లవకారులను చంపివేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా తన గళం, కలం ఎత్తారని తెలిపారు.
చత్తీస్‌ఘడ్‌లో 2005 లో రాజ్య ప్రేరేపిత సల్వాజుడుంను ప్రారంభించి ఆదివాసీల హననానికి తెర తీసినప్పుడు దానిని బలంగా వ్యతిరేకించిన వారిలో సుధాకర్ ఒకరని తెలిపారు. ఆ తర్వాత చిదంబరం ఆపరేషన్ గ్రీన్ హంట్‌ను ప్రారంభించి మునుపెన్నడూ కనీవినీ ఎరుగని నిర్బంధం ప్రయోగించినప్పుడు కూడా సురవరం సుధాకర్ నాయకత్వంలో సీపీఐ అందుకు వ్యతిరేకంగా సాగిన అన్ని ఐక్య కార్యాచరణలలో పాల్గొందని వివరించారు. హిందూత్వ ఫాసిజం పెద్ద ఎత్తున ప్రజలపై అన్ని రకాలుగా చేస్తున్న దాడికి, ఆపరేషన్ కగార్ పేరుతో అదివాసీలను వారి నేలనుంచి భేదలలు చేసి మన దేశ అడవులను, అక్కడి ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్న విధానాలకు వ్యతిరేకంగా, రైతాంగవు, కార్మికుల హక్కులను హరించే చట్టాలను చేస్తూ శ్రామికులపై చేస్తున్న కార్పొరేట్ దాడికి వ్యతిరేకంగా విప్లన, వామపక్ష, ప్రజాస్వామిక శక్తులన్నీ కలిసి పోరాటం చేయవలసిన ఈ సమయంలో సురవరం సుధాకర్ లాంటి వారు ఐక్యకార్యాచరణ కోసం నెలకొల్పిన మార్గం విప్లవ, వామపక్ష, ప్రజాస్వామిక శక్తులన్నిటికీ ఒక ఆదర్శమని కొనియాడారు.
కాగా, సీపీఐ సీనియర్ నేత, అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి సురవరం సుధాకర్ రెడ్డి ఆగస్టు 22వ తేదీన కన్నుమూశారు. సురవరం సుధాకర్ రెడ్డి తన విద్యార్థి దశనుండే విద్యార్థుల సమస్యలపై పోరాటం మొదలు పెట్టి ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. 1960లో ఏఐఎస్ఎఫ్ కర్నూల్ పట్టణ కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి అంచెలంచెలుగా జిల్లా కార్యదర్శిగా, ఏపీ రాష్ట్ర బాధ్యుడిగా, రెండు సార్లు ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధానకార్యదర్శిగా, జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించారని వెల్లడించారు. ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలను నిర్వహించారని గుర్తుకు చేశారు. 1971 లో సీపీఐ 9వ నేషనల్ కౌన్సిల్ సమావేశాల్లో జాతీయ కమిటీ సభ్యుడిగా, సీపీఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, 1998 లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. 2007 లో సీపీఐ జాతీయ మహాసభల్లో ఉప ప్రధాన కార్యదర్శిగా 2012లో పార్టీ ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యారన్నారు. 2012 నుంచి 2019 వరకు ఆయన జాతీయ ప్రధానకార్యదర్శిగా పదవిలో కొనసాగారని తెలిపారు. 1998 లో, 2004 లో నల్గొండ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారని మావోయిస్టు పార్టీ నివాళులు అర్పించింది.






