‘కాన్పూర్‌లో ప్రారంభించి.. తెలంగాణలో ముగిస్తాం’: CPI నేత రాజా సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-25 11:33:07  IST  )

ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ సీపీఐ(CPI) కీలక నిర్ణయం తీసుకున్నది.

‘కాన్పూర్‌లో ప్రారంభించి.. తెలంగాణలో ముగిస్తాం’: CPI నేత రాజా సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ సీపీఐ(CPI) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా(D.Raja) ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేస్తే ఏ ప్రభుత్వాన్ని అయినా నిలదీసే హక్కు ప్రజలకు, ప్రతిపక్షాలకు ఉంటుందని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(NDA Govt) చేతిలో కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. కుల రాజకీయాలు, మత రాజకీయాలకు కేరాఫ్‌గా బీజేపీ నిలిచిందని అన్నారు. ఓట్‌లు చోరీ అధికారంలోకి రావడం చాలా అన్యాయం అని అన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదని చెప్పారు. వచ్చే డిసెంబర్‌లో సీపీఐ పార్టీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రారంభించి.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ముగింపు వేడుకలు నిర్వహిస్తామని కీలక ప్రకటన చేశారు.

Next Story