CPI Telangana: ఇది స్వల్ప ఊరట మాత్రమే

by Gantepaka Srikanth |

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష సష్టంగా కనిపించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

CPI Telangana: ఇది స్వల్ప ఊరట మాత్రమే
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష సష్టంగా కనిపించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాదాపు సగం లోక్‌సభ స్థానాలు బీజేపీ ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి అదనంగా సాధించింది సున్నానే అని వెల్లడించారు. విభజన హామీలను పదకొండేళ్లవుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, కేవలం బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉన్న ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకే ప్రత్యేకంగా నిధులు కేటాయించారన్నారు. ఢిల్లీ ఎన్నికలను పెట్టుకొని ఉద్యోగులు, మధ్యతరగతి ఓటర్లు ఎక్కువ ఉన్నందునే ఆదాయ పన్ను పరిమితిని పెంచారని, ఇది స్వల్ప ఊరట మాత్రమేనన్నారు. ఇటీవల నిజామాబాద్‌ను ప్రకటించిన జాతీయ పసుపు బోర్డుపై గానీ, అంతకు ముందు ఏడాది ప్రకటించిన గిరిజన యూనివర్సిటీకి సంబంధించి నిధుల కేటాయింపుపై గానీ స్పష్టత లేదన్నారు.

రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. మొత్తమ్మీద కేంద్ర బడ్జెట్ ప్రైవేటీకరణకు మరింత బాటలు వేసిందన్నారు. ఆస్తుల నగదీకరణ పథకం కింద పదేళ్ళలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి రూ.10 లక్షల కోట్లు సేకరించడం, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 75 నుంచి 100 శాతానికి పెండం ఇందుకు నిదర్శనం అన్నారు. అప్పులు 182 లక్షల కోట్లకు చేరాయని, రక్షణ రంగానికి అత్యధికంగా రూ.4.91 లక్షల కోట్లు కేటాయించగా, గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు, వ్యవసాయానికి రూ.1.71 కోట్లు కలిపినా, రక్షణ రంగానికి చేరువలో లేవన్నారు. గ్రామీణ ఉపాధి మామీ పథకానికి రెండేళ్ళ క్రితం రూ.89,154 కోట్లు కేటాయించగా, ఈ సారి బడ్జెట్ రూ.86వేల కోట్లే కేటాయించడం చూస్తుంటే ఇది కార్పొరేట్ అనుకూల, పేద, మధ్య తరగతి వ్యతిరేక బడ్జెట్ గా స్పష్టమవుతోందని కూనంనేని సాంబశివరావు అన్నారు.

Next Story