- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా భర్తను చంపినవాళ్లను నేనే చంపాలి : చందు నాయక్ భార్య
చందు నాయక్ భార్య నారి భాయ్ హాట్ కామెంట్స్ చేశారు. నా భర్తను చంపిన వాళ్లను నేనే చంపాలంటూ చందు నాయక్ భార్య తన

దిశ, వెబ్ డెస్క్: చందు నాయక్ భార్య నారి భాయ్ హాట్ కామెంట్స్ చేశారు. నా భర్తను చంపిన వాళ్లను నేనే చంపాలంటూ చందు నాయక్ భార్య తన బాధను మీడియా ముందు చెప్పుకున్నారు. నా భర్తకు ఎన్ని బుల్లెట్లు దిగాయో.. హంతకులకు కూడా అన్ని బుల్లెట్లు దిగాలన్నారు. కాల్పులు జరిపినవారిలో ఒకరిని గుర్తు పడతా.... మొత్తం ఆ సమయంలో ముగ్గురిని చూశానని చెప్పారు చందు నాయక్ భార్య నారి భాయ్. దింతో చందు నాయక్ భార్య నారి భాయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉండగా, ఇది ఇలా ఉండగా.. ఇవాళ తెల్లవారుజామున మలక్ పేటలో సీపీఐ నాయకులు చందు నాయక్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. దీనికి సంబంధించిన సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
అయితే ఈ సంఘటన జరిగిన కొద్ది గంటలకే నలుగురు నిందితులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల సంఘటనలో పాల్గొన్న నలుగురు కూడా ఎస్ఓటి పోలీసుల ముందు లొంగిపోయారట. ఇందులో రాజేష్, శివ తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. నలుగురు పక్కా ప్లానింగ్ తో... హత్య చేసినట్లు చెబుతున్నారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే చందు నాయక్ ను హత్య చేసి ఉంటారని చెబుతున్నారు.






