లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రం.. ఉగాది పచ్చడిలా బడ్జెట్ : కూనంనేని

by Naga Rani Yarlagadda |

పాత బడ్జెట్ లో నంబర్లు మార్చి యథాతథంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శించారు.

లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రం.. ఉగాది పచ్చడిలా బడ్జెట్ : కూనంనేని
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉగాది పచ్చడిలా మిశ్రమంగా ఉందని సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. పాత బడ్జెట్ కు యధాతధంగా కొత్త బడ్జెట్ ఎక్కించారని, కొంత బడ్జెట్ ను పెంచడం తప్ప ఇంకేం మార్పులు లేవన్నారు." రాష్ట్రం మొత్తంగా రూ. 8.64 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మరొ లక్ష కోట్ల రూపాయల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆ లెక్కలు ఈ బడ్జెట్ చూపించలేదు. ఇంత డబ్బు ఎలా తీసుకువస్తారనేది పెద్ద ప్రశ్న? ఈ దశలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఈ బడ్జెట్ 1 కోటి 50 లక్షల కుటుంబాలకు కుటుంబ జీవిత భీమా సౌకర్యం కల్పించడం మంచి పరిణామం. గత బడ్జెట్లో విద్యకు 7.57 శాతం నిధులు కేటాయిస్తే, ఈ బడ్జెట్లో 8.22 శాతం కేటాయించారు. వైద్య రంగానికి సంబంధించి 4.2 శాతం మాత్రమే నిధులు కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్ రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దాదాపు రూ.58 వేల కోట్ల బడ్జెట్ లోటు చూపిస్తున్నారు. అంటే మళ్లీ అప్పు చేయాల్సిందే. గత బడ్జెట్ రూ. 22 వేల కోట్లు తగ్గినట్టుగానే ఈ బడ్జెట్ కూడా సుమారు రూ. 40 వేల కోట్లు తగ్గే అవకాశం ఉంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆర్ ఉద్యోగులు, జర్నలిస్టులు, కాంట్రాక్టు కార్మికులు, జెన్ సింగరేణి, జర్నలిస్టుల ప్రస్తావన లేకపోవడం దారుణం. గత బడ్జెట్ ఇందిరమ్మ ఇండ్లకు రూ.14 వేల కోట్లుగా కేటాయించారు. కానీ.. ప్రస్తుతం రూ.7 వేల కోట్లు కేటాయించారు. ఈ చర్యలతో ప్రభుత్వం చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంతిమంగా రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కచ్చితంగా అవసరముంది. లేకపోతే ‘చల్తీ కా నామ్ గాడీ తరహాలో ప్రభుత్వ పరిపాలన సాగుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అసంతృప్తిని మిగిల్చిందని సీపీఎం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఈ బడ్జెట్ మిశ్రమ బడ్జెట్అని, ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు లేవని విమర్శించారు. ముఖ్యంగా బడ్జెట్ లో పెన్షన్ల పెంపు విషయమే రాలేదన్నారు. గీత కార్మికులు, యాదవులు, ముదిరాజులు, చేనేత కార్మికులు వంటి వృత్తి సంఘాలకు బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. విద్యకు 20% డిమాండ్ చేస్తుంటే 8% మాత్రమే కేటాయించారు. ఆరోగ్యానికి 4% మాత్రమే కేటాయించారు. కొత్తగా ఇందిరమ్మ బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో, నైపుణ్యాభివృద్ధిలో ఈ బడ్జెట్ దిశానిర్దేశం చేయలేక పోయింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడేలా కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలన్నారు.

Next Story