CPI: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు

by Ramesh Naini |   (  Updated:2025-10-17 14:09:54  IST  )

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి (CPI) సీపీఐ సంపూర్ణ మద్దతు తెలిపింది.

CPI: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక(Jubilee Hills by-election)లో కాంగ్రెస్‌ (Congress) అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు తెలిపింది. శుక్రవారం సీపీఐ మద్దతు కోరుతూ టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ (Mahesh Kumar Goud) హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె. నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, ఈటి నరసింహ, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, కలవేణ శంకర్‌, ఎం. బాలనరసింహ, బాగం హేమంతరావు, వి.ఎస్‌.బోస్‌, సీపీఐ శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యంలతో భేటీ అయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై చర్చించారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు సీపీఐ (CPI) అందిస్తుందని రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story