- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CPGET Results: సీపీగెట్ ఫలితాలు విడుదల.. 51,317 మంది అభ్యర్థులకు అర్హత
రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీలకు సబంధించి పీజీ ప్రవేశాలకు నిర్వహించిన సీపీ గెట్ (CPGET Results) ఫలితాలు విడుదలయ్యాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీలకు సబంధించి పీజీ ప్రవేశాలకు నిర్వహించిన సీపీ గెట్ (CPGET Results) ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి సోమవారం ఫలితాలను విడుదల చేశారు. తొమ్మిది యూనివర్సిటీలలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెలలో ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలు(సీపీగెట్) నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 54, 692 అభ్యర్థులు హాజరు కాగా 51,317 అర్హత సాధించినట్లు తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు ర్యాంక్ కార్డ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అవసరమైన సర్టిఫికెట్లతో పాటు ర్యాంక్ కార్డ్‌ను అప్‌లోడ్ చేయకుండా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఏ అభ్యర్థిని అనుమతించరని పేర్కోన్నారు. www.osmania.ac.in / https://cpget.tgche.ac.in / www.ouadmissions.com వెబ్‌సైట్‌లలో సూచనలను అభ్యర్థులు పరిశీలించాలని సూచించారు.






