ముగింపు దశకు.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కోసం నియమించిన కొత్త సిట్‌కు నేతృత్వం వహిస్తున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్, దర్యాప్తు పురోగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ముగింపు దశకు.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కోసం నియమించిన కొత్త సిట్‌కు నేతృత్వం వహిస్తున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్, దర్యాప్తు పురోగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక సమావేశంలో మీడియా ప్రశ్నలకు ఆయన స్పందించారు. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉందని, అందువల్ల దర్యాప్తు అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. కేసులో కీలక నిందితుడైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించిన నివేదికలు సుప్రీంకోర్టు పరిశీలించి వెల్లడించే నిర్ణయాలపై తదుపరి చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.

నూతన సిట్ బృందం కీలక ఆధారాలు, బాధితుల స్టేట్మెంట్‌లు రికార్డ్ చేసినట్లు ఆయన పేర్కోన్నారు. కేసు దర్యాప్తు త్వరలో ముగింపు దశకు చెరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కోన్న ఎస్ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుమారు 12 సార్లు విచారించారు. ఆయనతో పాటు గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ వంటి వారి స్టేట్‌మెంట్లను కూడా సిట్ రికార్డ్ చేసింది. త్వరలోనే అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తుంది.

Next Story