- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైవింగ్ చేస్తూ 'స్ట్రీమింగ్'.. మృత్యువుకు వెల్కమ్ చెప్పడమే! వారికి సీపీ సజ్జనార్ వార్నింగ్
డ్రైవింగ్ చేస్తూ మొబైల్‌లో వీడియోలు చూడడం కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనే కాక, ప్రాణాలను పణంగా పెట్టే చర్య అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: డ్రైవింగ్ చేస్తూ మొబైల్‌లో వీడియోలు చూడడం కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనే కాక, ప్రాణాలను పణంగా పెట్టే చర్య అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన ఒక వీడియోను షేర్ చేస్తూ ఈ ప్రమాదకర చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలో ఓ వ్యక్తి స్కూటీపై ప్రయాణిస్తూ యూట్యూబ్ వీడియోలు చూస్తూ ట్రాఫిక్ మధ్య నిర్లక్ష్యంగా వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపిస్తాయి. అతను ఓ రైడ్ అగ్రిగేటర్‌కు చెందిన గిగ్ వర్కర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. క్షేమంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన చేతులే.. వినోదం మోజులో పడితే ప్రజల భద్రతకు గ్యారెంటీ ఎవరు? అని సీపీ సజ్జనార్ ప్రశ్నించారు.
క్షణకాలం అజాగ్రత్త కూడా తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని, ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడే మొబైల్‌లో వీడియోలు చూడడం (Distracted Driving) చట్టపరంగా నేరమని, ఇటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రైడ్ అగ్రిగేటర్ సంస్థలు తమ భాగస్వాముల ప్రవర్తనపై కట్టుదిట్టంగా నిఘా ఉంచాల్సిన బాధ్యత తమదేనని సీపీ సజ్జనార్ గుర్తు చేశారు. ‘ఇలాంటి ప్రమాదకర డ్రైవింగ్‌ను గమనించినప్పుడు మౌనంగా ఉండకండి. వెంటనే ఫిర్యాదు చేయండి. మీ వినోదం.. అమాయకుల పాలిట శాపం కాకూడదు’ అని సూచించారు. కాగా, ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి సంబంధిత రైడ్ అగ్రిగేటర్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.






