అలాంటి మీమ్స్ చేస్తే ఊరుకునేది లేదు.. మీమర్స్‌కు సీపీ సజ్జనార్ హెచ్చరిక

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-17 07:09:17  IST  )

దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకు సవాల్ విసిరిన రవిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టామన్నారు సీపీ సజ్జనార్.

అలాంటి మీమ్స్ చేస్తే ఊరుకునేది లేదు.. మీమర్స్‌కు సీపీ సజ్జనార్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమాలను పైరసీ చేసి.. ఐబొమ్మ, బొప్పం టీవీ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేస్తున్న ఇమ్మడి రవిని ఇటీవల హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రవి అరెస్టుపై సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీమర్స్ కు కీలక హెచ్చరిక చేశారు.

దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకు సవాల్ విసిరిన రవిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టామన్నారు. దీనిపై కొందరు సోషల్ మీడియాలో పోలీసులపై మీమ్స్ చేసి పోస్టు చేశారని, పోలీసులపై మీమ్స్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎవరైనా ఇందుకు విరుద్ధంగా మీమ్స్ చేస్తే.. వారిని కూడా ట్రేస్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read More...CP Sajjanar: 50 లక్షల మంది ఐబొమ్మ యూజర్ల డేటా చోరీ.. సీపీ సజ్జనార్ సంచలన విషయాలు వెల్లడి

Next Story