- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధాశ్రమంలో నటి శ్యామలను పరామర్శించిన సీపీ సజ్జనార్
టాలీవుడ్ నటి శ్యామలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరామర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి శ్యామలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరామర్శించారు. న్యూఇయర్ సందర్భంగా సజ్జనార్ కార్ఖానాలో ఉన్న ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న టాలీవుడ్ సీనియర్ నటి శ్యామలను పరామర్శించారు. శ్యామల చాలా కాలంగా అనారోగ్యం కారణంగా బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కృష్ణానగర్ లో ఆమె నివసిస్తున్న ఓల్డేజ్ హోం నుండి బయటకు తీసుకువచ్చి రోడ్డుపై వదిలేశారు. దీంతో ఆమె ఆత్మహత్యకు యత్నించారు.
ఈ క్రమంలో పోలీసులు అడ్డుకుని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి తరలించారు. ఇక నేడు సజ్జనార్ అక్కడకు వెళ్లడంతో ఆమెతో మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శ్యామలతో పాటు ఆశ్రమంలో ఉంటున్న ఇతరులను సైతం ఆయన పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పండ్లు పంపిణీ చేశారు. ఇదిలా ఉంటే శ్యామల తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. ఆంధ్రావాలా సినిమాలో ఆమె విలన్ తో మాట్లాడే ఫోన్ కాల్ సన్నివేశానికి ఎంతోమంది ఫిదా అయ్యారు.






