ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణ ప్రక్రియను పరిశీలించిన సీపీ సజ్జనార్

by Ramesh Naini |

ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన సిట్ టీం దూకుడుగా వ్యవహరిస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణ ప్రక్రియను పరిశీలించిన సీపీ సజ్జనార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన సిట్ టీం దూకుడుగా వ్యవహరిస్తోంది. సుప్రీంకోర్టు విచారణకు మరో వారం గడువు పెంచడంతో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఛీఫ్‌ ప్రభాకర్ రావును శనివారం సిట్ టీం విచారించింది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు జూబ్లీ హిల్స్‌పిస్‌లో విచారించారు. నూతన సిట్ టీం ఏర్పాటుతో బషీర్ బాగ్‌లోని సీసీఎస్‌లో విచారించారు. ప్రభాకర్ రావు విచారణ ప్రక్రియను సీపీ సజ్జనార్ పరిశీలించారు. గత వారం రోజుల విచారణపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన నేపథ్యంలో మరో మారు పూర్తి వివరాలు రాబట్టేందుకు విచారించారు.

రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారనే అంశం పైన ప్రధానంగా దృష్టి సారించారు. విచారణ అనంతరం ఆయనను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రభాకర్ రావును జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో వసతి ఏర్పాటు చేసి విచారించారు. తాజాగా సిట్ కార్యాలయం మార్చేందుకు కార్యాచరణ చేస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రభాకర్ రావు మరోసారి సుప్రీంకోర్టు ఆదేశించడంతో సిట్ విచారణ దూకుడుగానే వ్యవహరిస్తోంది. ఐపీఎస్ స్థాయి హోదాలో పని చేయడంతో అదే స్థాయి ఐపీఎస్ అధికారులతో విచారణ ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబరేటరీస్ రిపోర్ట్ విచారణలో కీలకం కానుంది. మరో ఆరు రోజుల పాటు సిట్ బృందం విచారించనుంది.

Next Story