- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay: గోమాత సేవలను పాఠ్యాంశాల్లో చేర్చాలి: బండి సంజయ్
రాబోయో రోజుల్లో అన్ని మతాలు పోటీ పడి మరీ గోసంతతిని కాపాడుకునే పరిస్థితి రాబోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే రోజుల్లో అన్ని మతాలు పోటీ పడి మరీ గోసంతతిని కాపాడుకునే (Cow Protection) పరిస్థితి రాబోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. రాబోయే తరాలకు గోవు ప్రాముఖ్యత, ప్రాధాన్యత తెలియాలంటే పాఠ్యాంశాల్లో గోమాత సేవలను పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి తెలంగాణ ప్రాంత గో విజ్ఞాన అవార్డులు, సన్మాన కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోమాత మత విశ్వాసం కాదని గోసంతతితోనే పర్యావరణ, ప్రకృతికి రక్ష అన్నారు. అందువల్ల అన్ని మతాలు గోవుల సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచమంతా “కౌ-బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్"పై దృష్టి పెట్టిందని గోవును కాపాడితే ప్రకృతిని కాపాడినట్టేనని, ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్‌ను కాపాడినట్లేనన్నారు. గోమాతను కాపాడడం మన అందరి పవిత్ర బాధ్యత అని చెప్పారు. అయితే గోవును వధించే వారి చేతుల్లో తుపాకులు ఉంటే గోవులను రక్షించే వారిపై కేసులు నమోదు అవుతున్నాయని విమర్శించారు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు.






