TG: పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

by Gantepaka Srikanth |

నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

TG: పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ(Nalgonda) జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి(Suicide Attempt) పాల్పడింది. ఈ ఘటన దామరచర్ల మండలం రాళ్లవాగుతండా సమీపంలో చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం ప్రేమజంటను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచన మేరకు హైదరాబాదుకు తీసుకొచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం తేర్యాల గ్రామానికి చెందిన సౌమ్య, రమేష్‌లుగా పోలీసులు గుర్తించారు. ప్రేమ వివాహానికి పెద్దలు నిరాకరించడంతోనే వారు ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇలాంటి ఘటనే సరిగ్గా నెల రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాచారంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన పూజ, సిద్ధగోని మహేశ్‌లు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. వరుస కుదరకపోవడంతో ఇరు కుటుంబాల్లో పెళ్లికి నిరాకించారు. దీంతో మనస్తాపానికి గురైన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజులకు ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని మహేశ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

Next Story