- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Agriculture University: డిప్లమా కోర్సుల కౌన్సిలింగ్ షురూ
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయంలోని ఆడిటోరియంలో మంగళవారం కౌన్సిలింగ్ ప్రారంభమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయంలోని ఆడిటోరియంలో మంగళవారం కౌన్సిలింగ్ ప్రారంభమైంది. మొదటి సీటు కేటాయింపు పత్రాన్ని శ్రీవర్ధన్‌కు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్రికల్చర్కోర్సులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తంతా వ్యవసాయ రంగానికే ఉంటుందన్నారు. కౌన్సిలింగ్విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆఫ్ అగ్రికల్చర్, డైరెక్టర్ ఆఫ్ పాలిటెక్నిక్స్ డాక్టర్ కే.ఝాన్సీ రాణి, డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ కేబీ ఈశ్వరి, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డాక్టర్ కేవీ రమణా రావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎం.మల్లారెడ్డి, ప్రొఫెసర్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ డాక్టర్ శ్రవణ్ కుమార్, విశ్వవిద్యాలయం వివిధ విభాగాలకి చెందిన సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.






