Council Chairman: వైద్యులు, ఉపాధ్యాయుల తీరుపై మండలి చైర్మన్ అసహనం

by Ramesh Naini |

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించకపోవడం పై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Council Chairman: వైద్యులు, ఉపాధ్యాయుల తీరుపై మండలి చైర్మన్ అసహనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించకపోవడం పై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం శాసన మండలి సమావేశాల సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను లేవనెత్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులు మధ్యాహ్నం ఒంటి గంట కాగానే విధులను వదిలి ప్రైవేట్ ప్రాక్టీస్ కోసం వెళ్తున్నారని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు ఆర్ఎంపీలు కమిషన్ల కోసం ఆశపడి, అమాయక పేద రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు పంపిస్తూ వారిని లూటీ చేస్తున్నారన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలిలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రభుత్వ స్కూళ్ల గురించి మాట్లాడుతుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు వెళ్లిపోతున్నారని, ఇంకా వాళ్లకి స్పోర్ట్స్ ఆడించే వారు ఎవరుంటారు అంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 26 వేల స్కూల్స్, లక్షా 20 వేల టీచర్లు ఉన్నారని, కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చాలా వరకు మార్చాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story