- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే వారం నుంచి పత్తి కొనుగోలు చేపట్టాల్సిందే.. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
అధిక వర్షాలతో రైతులు అనుకున్నంత పత్తి దిగుబడులు లేవని, ఈ సమయంలో రైతు ప్రయోజనాలకు విరుద్దంగా ప్రవర్తిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హెచ్చరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అధిక వర్షాలతో రైతులు అనుకున్నంత పత్తి దిగుబడులు లేవని, ఈ సమయంలో రైతు ప్రయోజనాలకు విరుద్దంగా ప్రవర్తిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హెచ్చరించారు. వచ్చేవారం కొనుగోళ్లు ఎటువంటి పరిస్థితులోనైనా చేయాల్సిందేనని ఆదేశించారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోలు టెండర్లలో పాల్గొనకపోవడంతో వారి సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్రంలో 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా 24.70 లక్షల క్వింటాల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా వేశామని పత్తికి మద్దతు ధర అందించడానికి గత నెల 12న సీసీఐ సీఎండీ, జిన్నింగ్ మిల్లర్లు తో సమావేశం జరిపినట్లు చెప్పారు. సీసీఐ విడుదల చేసిన టెండర్ లో లింట్ శాతం ఎల్1., ఎల్2 అలాట్మెంట్ స్లాట్ బుకింగ్ ఏరియా మ్యాపింగ్ కోసం ఉన్న నిబంధన సుదీర్ఘంగా చర్చించమన్నారు.
రాష్ట్రంలో 341 జిన్నింగ్ మిల్లులు ఉన్నా ఇప్పటి వరకు టెండర్లలో ఎవరు పాల్గొనలేదు. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గత నెల 20న సీసీఐ విడుదల చేసిన లింట్ పర్సంటేజ్ ఎల్1 స్లాట్ బుకింగ్ ఏరియా మ్యాపింగ్ విషయాలు తగిన రీతిలో పరిశీలించి గత సీజన్ లో అనుసరించిన విధానం ఈ ఏడాది కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేయడంతో పాటు టెండర్లు వేయడానికి ముందుకు లేదు. దీంతో ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరగా పరిష్కారం చేయాలని కోరారు. ఈ నెల 1వ తేదీన ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసి కొత్త నిబంధనలతో కొనుగోళ్ల ప్రక్రియలో సమస్యలు తలెత్తే ఆస్కారం కలదని మార్కెటింగ్ అధికారులు వివరించగా, దానిని అక్కడి పరిస్థితుల దృష్ట్యా సడలిస్తామని అధికారులు తెలిపారు. అదేవిధంగా లింటుశాతం కూడా ప్రతి 15రోజులకొకసారి నిర్ణయించి అమలు చేస్తామన్నారు. అయినప్పటికీ జిన్నింగ్ మిల్లులు టెండర్లు వేయటానికి ముందుకు రాకపోవడంతో మరొకసారి సీసీఐ , జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో సమావేశ జరిపి వారి సందేహాలు,భయాలను తొలగించాలని ఆదేశించి సోమవారం మరొకసారి వారితో సమావేశమయ్యేందుకు మార్కెటింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు.






