- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో పత్తి సేకరణ కంప్లీట్.. ఉత్పత్తిలో ఆదిలాబాద్ టాప్
రాష్ట్రంలో పత్తి సేకరణ ప్రక్రియ పూర్తియిన నేపథ్యంలో కపాస్ కిసాన్ యాప్‌ను సీసీఐ మూసి వేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పత్తి సేకరణ ప్రక్రియ పూర్తియిన నేపథ్యంలో కపాస్ కిసాన్ యాప్‌ను సీసీఐ మూసి వేసింది. తెలంగాణలో యాప్2025 అక్టోబర్21 నుంచి అందుబాటులోకి రాగా.. ఇప్పటివరకు సీసీఐ 15.60 లక్షల మెట్రిక్‌టన్నులు పత్తి కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.12313 కోట్లు కాగా.. 8.39 లక్షల మంది రైతులు సీసీఐ ఏర్పాటు చేసిన 336 కేంద్రాల్లో అమ్మకాలు చేశారు. పత్తి అమ్మిన రైతుల ఖాతాల్లో రూ.10673 కోట్లు జమ చేసినట్లు సీసీఐ తెలిపింది. ఈఏడాది రాష్ట్రంలో 45.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా ప్రభుత్వం 28.29 లక్షల మెట్రిక్‌టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. మద్దతు ధర రూ. 8110 ప్రకటించి ఒక రైతు నుంచి ఏడు క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.
పత్తి ఎక్కువ పండించిన రైతులు స్ధానిక వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద ధృవీకరణ చేస్తేనే మార్కెటింగ్అధికారులు తూకం వేశారు. అయితే కొన్ని జిల్లాల్లో బ్రోకర్లు రైతులకు యాప్‌ద్వారా బుకింగ్చేయడం రాకపోవడంతో తాము చేస్తామని అన్నదాతలకు మోసపూరిత మాటలు చెప్పి మద్దతు ధర కంటే రూ.1200లకు తక్కువకు కొనుగోలు చేశారు. వెంటనే విజిలెన్స్అధికారులు ప్రభుత్వ కేంద్రాల్లో దళారుల పత్తి అమ్మకాలు చేయకుండా చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ప్రైవేటు వ్యాపారులు సుమారు 3.50 లక్షల మెట్రిక్‌టన్నుల వరకు కొనుగోలు చేయవచ్చని అంచనా ఉంది. రైతుల వద్ద చివరి పత్తి ఉంటే ప్రైవేటు వ్యాపారులకే అమ్ముకోవాలని అధికారులు సూచించారు.
పత్తి ఉత్పత్తిలో ఆదిలాబాద్ టాప్..
ఈఏడాది పత్తి పంట దిగుబడిలో 1.40 లక్షల మెట్రిక్టన్నులతో ఆదిలాబాద్జిల్లా టాప్‌లో నిలిచింది. తరువాత నల్లగొండ జిల్లా 1.38 లక్షల మెట్రిక్‌టన్నులు, వరంగల్జిల్లా 1.21 లక్షల మెట్రిక్‌టన్నులు, కొమురం బీమ్ఆసిఫాబాద్1.20 లక్షల మెట్రిక్‌టన్నులు, సంగారెడ్డి 1.01 లక్షల మెట్రిక్‌టన్నులు, వికారాబాద్, నాగర్‌కర్నూల్84 వేలు, రంగారెడ్డి 76 వేలు, సిద్దిపేట 73వేలు, జనగాం 66 వేలు, యాద్రాద్రి భువనగిరి 65 వేల టన్నుల పంట ఉత్పత్తి అయింది. ఇక అతి తక్కువగా జగిత్యాల 1525 టన్నులు, మెదక్4423 వేల టన్నుల కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
కపాస్ కిసాన్ యాప్‌తో ఇబ్బందులు
ఈ ఏడాది సీసీఐ కొత్త నిబంధనలతో రైతులు ఇబ్బందిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కపాస్కిసాన్యాప్లో స్లాట్బుకింగ్కావాలంటే వారం పది రోజుల సమయం పట్టింది. సీసీఐ పెట్టిన సమయంలో దళారులకు మాత్రమే స్లాట్దొరకింది. నిజమైన రైతులకు దొరక లేదు. అలాగే ఎకరానికి 7 క్వింటాల్ల పత్తిమాత్రమే కొనుగోలు చేయడంతో ప్రభుత్వ కేంద్రాల వైపు రావడానికి రైతులు మొగ్గు చూపలేదు. దళారుల వద్దకే వెళ్లారు. ఇదే అదునుగా భావించి దళారులు దోపీడీకి తెగబడ్డారు.






