'అలంపూర్‌లో అవినీతి రాజ్యమేలుతోంది'

by Disha Web Desk 4 |
అలంపూర్‌లో అవినీతి రాజ్యమేలుతోంది
X

దిశ, అయిజ : అలంపూర్ అధికార పార్టీ పాలనలో అవినీతి, కమిషన్లు రాజ్యమేలుతున్నాయని, అక్రమ ఇసుక, మద్యం దందాలతో అధికార పార్టీ నాయకులు అక్రమ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎస్.ఏ సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. హాత్ సే హాత్ జోడో యాత్ర 2వ రోజు అయిజ మండలంలోని ఏక్లాస్ పురం, దేవబండలో కొనసాగుతోంది. గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరితో చేయి చేయి కలుపుతూ ప్రజలందరితో మమేకమై కాంగ్రెస్ వాదాన్ని వినిపిస్తూ సంపత్ కుమార్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ యాత్రకు మంచి స్పందన వచ్చిందన్నారు. దేశంలో విప్లవాత్మకమైన మార్పునకు ఇది నాంది అన్నారు. నిరంకుశ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.

అవినీతి కుటుంబ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. 60 రోజులపాటు అలంపూర్‌లోని అన్ని మండలాలలో ప్రతి గ్రామాన్ని దర్శించి ప్రజలు పడుతున్న సమస్యలను ఇబ్బందులను తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేస్తూ ప్రజల ఆదరాభిమానాలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశయాలను సుసాధ్యం చేస్తామని తెలిపారు. యాత్రను విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ యాత్రతో బీఆర్ఎస్ అవినీతి పాలన అంతమై సోనియమ్మ రాజ్యం వస్తుందని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఒక చోట చేనేత మగ్గంపై కూర్చుని నేశారు. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ వెంట అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు ,నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read..

తుర్కియే, సిరియా భూకంపాలపై Minister KTR ఆవేదన

Next Story

Most Viewed