ఏఎస్ఐ పేరుతో ఫోన్ చేసి 75 వేల స్వాహా

by Mahesh |
ఏఎస్ఐ పేరుతో ఫోన్ చేసి 75 వేల స్వాహా
X

దిశ, నేరేడుచర్ల: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు అప్డేట్ అవుతున్నారు. ఈజీ మనీకి అలవాటైన కేటుగాళ్లు కొత్త కొత్త ఆలోచనలతో డబ్బులు ఏవిధంగా దోచుకోవాలో చుస్తున్నారు. గతంలో పలు రకాలుగా మోసాలకు పాల్పడుతూ.. ఓటీపీ నెంబర్ చెప్పించుకుని పలు అకౌంట్‌లో ఉన్న డబ్బులు డ్రా చేసుకునేవారు. ఈ కేటుగాళ్లు చివరకు పోలీస్‌ల పేర్లను కూడా ఉపయోగించుకున్నారు. హలో నేను ఏఎస్ఐను మాట్లాడుతున్న.. మా ఎస్ఐ గారి కూతురికి చాలా సీరియస్‌గా ఉంది. నేను నీకు రూ.75 వేల నగదు పంపిస్తున్నా.. వెంటనే ఫోన్ పే ద్వారా నాకు తిరిగి ఆ మొత్తాన్ని పపండి అంటూ ఒక అగంతకుడు ఫేక్ ఫోన్ కాల్ చేసి సైబర్ నేరాలకు పాల్పడిన సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నేరేడుచర్ల పట్టణంలోని ఓ బంక్ యజమానికి ఈ నెల 17(శుక్రవారం) రాత్రి సమయంలో నేను ఏ ఎస్ ఐ ని మాట్లాడుతున్నాను నా దగ్గర రూ.75 వేలు నగదు ఉంది .వాటిని మా మనిషి ద్వారా నీ వద్దకు పంపుతున్నాను. వెంటనే నా అకౌంట్లో‌కి ఫోన్ ఫే ద్వారా అమౌంట్ పంపండి అని ఫోన్ చేశాడు. దీంతో ఆ బంక్ యజమాని నా వద్ద ఫోన్ పే లేదని సమాధానం చెప్పాడంతో మీకు తెలిసిన వారు ఉంటే వారి నుండి పంపించండని ఆదేశించాడు. దీంతో ఆ బంక్ యజమాని పట్టణానికి చెందిన ఒక వ్యక్తికి చెందిన నెంబర్ ఇచ్చాడు. వెంటనే ఆగంతకుడు ఆ వ్యక్తి నెంబర్ కి ఫోన్ చేసి కొంచెం అర్జెంట్ గా ఉంది. వెంటనే ఫోన్ ఫే చేయాలని పట్టణానికి చెందిన మరో బంక్‌లో పని చేసే సిబ్బంది నెంబర్ ఇచ్చాడు.

ఆయన మాటలను నమ్మిన ఆ వ్యక్తి ఆయన వద్ద సరిపోను మొత్తం నగదు లేనప్పటికి మరో వ్యక్తిని పిలిపించుకొని ఇరువురు కలిసి మొత్తం రూ. 75 వేలు ఫోన్ పే ద్వారా పంపించారు. తిరిగి సైబర్ నేరగాడు వెంటనే అమౌంట్ జమైన పెట్రోల్ బంక్ సిబ్బందికి ఫోన్ చేసి నేను ఏ ఎస్ ఐ ని మాట్లాడుతున్నాను. నీ ఖాతాకు రూ.75 వేలు ఫోన్ ఫే ద్వారా వచ్చాయని వాటిని నేను పంపిన క్యూఆర్ కోడ్ కి పంపమని ఆదేశించాడు. వెంటనే దానికి అతను పంపించాడు. ఫోన్ పే ద్వారా నగదు కొట్టిన ఇరువురు ఎంత సమయం వేచి చూసిన ఏఎస్ఐ పంపిస్తానన్న డబ్బు లేకపోవడంతో తాము సైబర్ నేరగాడి చేతిలో మోసపోయామని గ్రహించి వెంటనే 1930 సైబర్ క్రైమ్ ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంఘటన ఒక నెల రోజుల క్రితం మరో బంకులో కూడా జరిగిందని అప్పుడు 30 వేల రూపాయలు ఇలాగే చెప్పి కేటుగాళ్లు కాల్ చేసినట్లు సమాచారం.



Next Story

Most Viewed