నారాయణపేట జిల్లాలో ఘోరం.. ట్రాక్టర్ బోల్తాపడి యువకుడి దుర్మరణం

by Shiva |
నారాయణపేట జిల్లాలో ఘోరం.. ట్రాక్టర్ బోల్తాపడి యువకుడి దుర్మరణం
X

దిశ, మక్తల్: ట్రాక్టర్ బోల్తాపడి ఓ యువకుడు దుర్మరణ పాలైన ఘటన నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం పెద్దసంబ్రం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాగనూర్ మండల పరిధిలని నేరేడగం గ్రామానికి చెందిన బస్వలింగప్ప కర్ణాటక శివారులోని గుర్మత్కల్ తాలూకా కనేకల్ గ్రామంలో అమ్మమ్మ వాళ్ల పొలం దున్నేందుకు వెళ్లాడ. ఈ క్రమంలోనే సాయంత్రం పని ముగించుకొని రాత్రి స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ సంబ్రం గ్రామ చెరువు కట్టపైకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం రాత్రి పూట జరగడంతో ఎవరూ బస్వలింగప్పను గుర్తించలేదు. దీంతో అతడు అక్కడిక్కక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, రెండేళ్ల కూతురు ఉంది. ఈ క్రమంలోనే నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story