సానీయా మీర్జా రెండో పెళ్లి.. షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన పాక్ నటుడు!

by Samataha |
సానీయా మీర్జా రెండో పెళ్లి.. షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన పాక్ నటుడు!
X

దిశ, సినిమా : భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా తన భర్తకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ మాజీ క్రికేటర్ షోయాబ్ మాలిక్‌‌ను ప్రేమించిన ఈమె.. భారత్, పాకిస్తాన్ సరిహద్దులను కూడా లెక్క చేయకుండా వారి ప్రేమను మూడుముళ్ల బంధంగా ములుచుకుంది. ఎంతో సంతోసంగా వీరి జీవితంసాగింది. కానీ అంతలోనే ఊహించని పరిణామం ఎదురై, మనస్పర్థల కారణంగా వీరు తమ 14 ఏళ్ల వైవాహిక జీవితాన్ని వదులుకున్నారు. ఇక వీరు విడాకులు తీసుకున్నామని ప్రకటించగానే షోయాబ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో అనేక రూమర్స్ పుట్టుకొచ్చాయి. షోయాబ్ వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నందుకే సానియా విడాకులిచ్చిందని.

అయితే తాజాగా సానియాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. సానియా మిర్జా రెండో పెళ్లిపై పాకిస్తాన్‌ నటుడు నబీల్‌ జాఫర్‌ ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. రీసెంట్‌గా మైండ్‌ నా కర్నా విత్‌ అహ్మద్‌ అలీ బట్‌'పాక్‌ న్యూస్‌ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విడాకులు తీసుకుంటే రెండో పెళ్లి చేసుకోవాలా? ఒంటరిగా జీవిస్తే సరిపోదా? అనే సానియా మీర్జా చెప్పిన మాటలకు తన అభిప్రాయంచ చెప్పమని యాంకర్‌ నటుడు నబీల్‌ జాఫర్‌ అడిగాడు. దీనికి అతడు సానియా మీర్జా రెండో పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ.. విడాకులు తీసుకుంటే లైఫ్ జర్నీ ఆగిపోయినట్లు కాదు. విడాకులు తీసుకోవడం దురదృష్టకరం. కానీ దాని తర్వాత ఎవరి జీవితం చీకటి మయం కాకూడదు. సానియా నీకు మంచి పార్టన్ దొరికితే నువ్వు తప్పకుండా రెండో పెళ్లి చేసుకో.. సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోవడం ఏం తప్పుకాదు. ఎలాగు షోయాబ్ రెండో పెళ్లి చేసుకున్నాడుగా అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed