హైదరాబాద్ బిర్యానీకి ఫిదా అయిన ట్రావిస్ హెడ్

by Mahesh |
హైదరాబాద్ బిర్యానీకి ఫిదా అయిన ట్రావిస్ హెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో సన్ రైజర్స్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఈ సీజన్ లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. పరుగుల వరద పారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో లీగ్ స్టేట్ లోని చివరి మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి హెడ్ తన భార్యతో కలిసి బంజారాహిల్స్ సమీపంలో ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్‌కి వెళ్ళాడు. అక్కడ హైదరాబాద్ స్పెషల్ బిర్యాని తిన్నారు. అనంతరం హోటల్ చేరుకున్నాక హెడ్ తన భార్య జెస్సికి మొదటిసారి హైదరాబాద్ బిర్యానీ రుచి చేయించినట్లు తెలిపారు. అలాగే ఆమెకు ఈ బిర్యాని ఎంతగానో నచ్చిందని "హైదరాబాద్ బిర్యాని ఫర్ మై ల్" అంటూ హెట్ తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. దీంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఆతని ట్వీట్ ను రీ పోస్ట్ చేస్తున్నారు. ఈ సీజన్ లో హెడ్ భారీ షాట్లతో రెచ్చిపోతూ.. 11 మ్యాచుల్లో 533 పరుగులు చేసి..ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన మూడో ప్లేయర్ గా నిలిచాడు. కాగా ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 పంజాబ్ తో మ్యాచ్ ఉంది.

Next Story