సీఎంను కలుస్తున్నా.. భూ వివాదంపై మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Ramesh N |
సీఎంను కలుస్తున్నా.. భూ వివాదంపై మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోనిసుచిత్రలో భూ వివాదంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీస్ కేసు అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూవివాదం విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. పోలీసులు మా వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని విషయాలను సీఎం రేవంత్ ను కలిసి వివరిస్తామని అన్నారు. మే 20న సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరామని చెప్పారు.

2011లో మల్లారెడ్డి, నేను రాజకీయాల్లో లేము : మర్రి రాజశేఖర్

40 ఏళ్లగా ల్యాండ్‌కు కంపౌండ్ వాల్ ఉందని, ఆ స్థలం తాము కొనుగోలు చేసి 14 ఏళ్లు అవుతుందని మల్లారెడ్డి స్పష్టం ఆయన చేశారు. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. వాగ్వాదానికి వచ్చిన వారు ల్యాండ్ గ్యాబర్స్ ముఠా అని ఆరోపించారు. ఆ ముఠా రూ. 5 కోట్లకు డీల్ కుదుర్చుకోని.. పది మందికి పైగా ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలోనే రాత్రికి రాత్రి వంద మంది వచ్చి దౌర్జన్యంగా స్థలంలో ఫెన్సింగ్ వేసి, గోడ కట్టారన్నారు. వారికి పోలీసులు సపోర్ట్ చేశారని తెలిపారు. ఈ వివాదంపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తాము 13 ఏళ్ల క్రితం ఆ భూమిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి దానికి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నాము. 2011లో మల్లారెడ్డి, నేను అసలు రాజకీయాల్లోకి రాలేదు. కొందరు కావాలనే మాపై వివాదాలు సృష్టిస్తున్నారు. లీగల్ గా రమ్మంటే మాపైనే దౌర్జన్యం చేస్తున్నారన్నారు. అలాగే ఈ వివాదంపై సర్వే కొనసాగుతుంది. త్వరలోనే ఇది ఎవరి భూమి అనేది తేలిపోతుందని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed