- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
caste census: కులగణనను సరిచేయండి.. సీఎస్ కు బీఆర్ఎస్ విజ్ఞప్తి
కులగణనను సరిచేయాలని సీఎస్ కు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కులగణనలో (Caste Census) అశాస్త్రీయ పద్ధతులు అవలంభించిందని బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆరోపించింది. ఈ మేరకు బీసీలకు అన్యాయం చేసేలా ఉన్న కులగణనను వెంటనే సరిచేయాలని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని (CS Shanti Kumar) కోరింది. ఈ మేరకు ఇవాళ సచివాలయంలో సీఎస్‌ను బీఆర్ఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపరిచిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు (Local Body Elections) నిర్వహించాలని కోరారు. కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించి చూపించిన కుట్రను సరిచేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. రిజర్వేషన్ల అంశంలో బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసేందుకే ఏడాది పాటు కులగణన కార్యాచరణ చేపట్టకుండా కాలయాపన చేసిందన్నారు. తీరా హడావుడిగా న్యాయస్థానాల తీర్పులకు విరుద్ధంగా ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఆశాస్త్రీయంగా విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ, కుటుంబ, కులగణన సర్వేను చేపట్టిందని ఆరోపించారు. ఈ సర్వేలో 2011 కేంద్ర గణాంకాలు, 2014 సమగ్ర కుటుంబ సర్వేలతో పోల్చితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన సర్వేల్లో బీసీ కులాల జనాభా సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గిందని ఆరోపించారు. బీసీల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని పొరపాట్లను సరిదిద్దాలని కోరారు.






