- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అరెస్టు చేయాలి: హస్తినాపురం కార్పొరేటర్
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డిని శాసనసభకు అనర్హుడిగా ప్రకటించాలని హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు డా. వెంకటేష్ చౌహన్ లు సోమవారం ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమీషన్ కు ఫిర్యాదు చేశారు. తక్షణమే విచారించి అరెస్టు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డిని శాసనసభకు అనర్హుడిగా ప్రకటించాలని హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు డా. వెంకటేష్ చౌహన్ లు సోమవారం ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమీషన్ కు ఫిర్యాదు చేశారు. తక్షణమే విచారించి అరెస్టు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. తనను అవమానిస్తూ సుధీర్ రెడ్డి మాట్లాడిన తీరును కమిషన్ కు వివరించారు. ఎల్బినగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా వారు కమిషన్ ను కోరారు.
గిరిజన శక్తి అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహన్ మాట్లాడుతూ.. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ పై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జాతీయ ఎస్టి కమిషన్ ను కలిసి తక్షణమే న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. గిరిజన బిడ్డ సుజాత నాయక్ కి న్యాయం జరిగేంత వరకు గిరిజన సంఘాల పోరాటం ఆగదని హెచ్చరించారు. ఎమ్మెల్యేకు ఒక న్యాయం సామాన్యులకు ఓ న్యాయమా ? గిరిజన బిడ్డకు న్యాయం జరగకపోతే రాబోయే కాలంలో ఛలో ఎల్బీనగర్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టి నుండి సుధీర్ రెడ్డి ని సస్పెండ్ చేయాలని కోరారు. ఎంఎల్ఏ సుధీర్‌రెడ్డి అంశంలో త్వరలో తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.






