MLA దుర్గం చిన్నయ్యతో వివాదం.. శేజల్‌కు మహిళా కమిషన్ కీలక ఆదేశాలు

by Disha Web Desk 4 |
MLA దుర్గం చిన్నయ్యతో వివాదం.. శేజల్‌కు మహిళా కమిషన్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, శేజల్ ఇష్యూ జాతీయ మహిళా కమిషన్ కు చేరింది. గత కొన్ని రోజులుగా దుర్గం చిన్నయ్యపై శేజల్ లైంగిక ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. శేజల్ వేధింపుల కేసులో మహిళా కమిషన్ తాజాగా స్పందించింది. జాతీయ మహిళా కమిషన్ నుంచి శేజల్ కు పిలుపు వచ్చింది. ఈ రోజు ఉదయం 11:30 హాజరు కావాలని జాతీయ మహిళా కమిషన్ శేజల్ కు సూచించింది.

అయితే శేజల్ మరో సెల్ఫీ వీడియో విడుదల చేసింది. బిజినెస్ మీటింగ్ పేరుతో పిలిచి మందు పార్టీ ఏర్పాటు చేశారని ఫైర్ అయింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ రూమ్ నెంబర్ 404లో మందు సిట్టింగ్ ఏర్పాటు చేశారని శేజల్ తెలిపింది. తన దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులు డిలీట్ చేశారని సంచలన ఆరోపణలు చేసింది. తన దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఎమ్మెల్యే అనుచరులు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాట్లాడుతున్నానన్నారు. అయితే శేజల్ ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద విషం తాగిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed