మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరుగనివ్వం.. VHP సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-20 16:08:33  IST  )

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీ(Miss World Competitions)లపై వివాదం రాజుకుంది. వచ్చే మే 4వ తేదీ నుంచి 31 వరకు తెలంగాణ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి.

మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరుగనివ్వం.. VHP సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీ(Miss World Competitions)లపై వివాదం రాజుకుంది. వచ్చే మే 4వ తేదీ నుంచి 31 వరకు తెలంగాణ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. హైదరాబాద్ వేదికగా గ్రాండ్ ఫినాలే‌తో పాటు ప్రారంభ, ముగింపు వేడుకలు ఉండబోతున్నాయి. అయితే మిగతా ఈవెంట్స్ కోసం వరంగల్‌లోని రామప్ప, యాదాద్రి, లక్నవరం, అనంతగిరిలను పరిశీలిస్తున్నారు. ఇక తెలంగాణలో అందాల పోటీల నిర్వహణను అడ్డుకుంటామని వీహెచ్‌పీ(Vishva Hindu Parishad) నేతలు హెచ్చరికలు జారీ చేశారు. పవిత్రమైన ఆలయాలు ఉన్నచోట అందాల పోటీలు నిర్వహించడం సరికాదని.. ఎట్టి పరిస్థితుల్లో జరుగనివ్వమని స్పష్టం చేశారు. మరోవైపు గతంలోనూ భారత్‌లో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. 1996, 2024లో ముంబై వేదికగా పోటీలు నిర్వహించారు. తాజాగా.. మరోసారి భారత్ ఆతిథ్యం ఇవ్వడంతో పాటు తెలంగాణ వేదికగా జరుగుతుండటం చర్చనీయాంశం అయింది. తెలంగాణ వేదికగా 72వ మిస్‌వరల్డ్‌ పోటీలను నిర్వహించనుండటం చాలా ఆనందంగా ఉందన్నారు తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీలపై స్మితా సభర్వాల్(Smita Sabharwal) మాట్లాడుతూ.. ఎంతో శ్రమించి ప్రపంచ సుందరి పోటీలను తెలంగాణకు తీసుకువస్తున్నాం.. తెలంగాణ ప్రత్యేకతల్ని వివరించాం.. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story