- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గద్దర్ అవార్డుల ఆహ్వాన పత్రికపై వివాదం.. విమర్శలతో దిద్దుబాటు
తెలంగాణ ప్రభుత్వం ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ఏర్పాటు చేసిన సినీ అవార్డుల (Gaddr Awards) కార్యక్రమం ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కార్యక్రమం జూన్ 14, 2025న హైటెక్ సిటీ (hitech city)లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో..

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ఏర్పాటు చేసిన సినీ అవార్డుల (Gaddr Awards) కార్యక్రమం ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కార్యక్రమం జూన్ 14, 2025న హైటెక్ సిటీ (hitech city)లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో, ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో లేకపోవడం పట్ల రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తమైంది.
భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తన ఎక్స్ పోస్ట్‌లో ఈ విషయాన్ని ఖండిస్తూ, "ప్రజా గాయకుడు గద్దర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించింది. గద్దర్ పేరిట ఇచ్చే అవార్డుల ఆహ్వాన పత్రికలో ఆయన ఫోటో లేకపోవడం బాధాకరం. కనీసం అవార్డుల ప్రదానోత్సవంలో గద్దర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి గౌరవించాలి" అని పేర్కొన్నారు. ఇలాంటి సెంటిమెంట్‌ను ఇతర ఎక్స్ యూజర్లు కూడా వ్యక్తం చేశారు. ఒకరు "పులిహోరలో పులి ఉండదు, గద్దర్ అవార్డుల్లో గద్దర్ ఫోటో ఉండదు" అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
ఈ విమర్శల నేపథ్యంలో.. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సినిమాటోగ్రఫీ శాఖ అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటోను జోడించి, కార్యక్రమ వేదికపై ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ చర్యలు ప్రజల నుండి వచ్చిన ఒత్తిడి ఫలితంగా చేపట్టినట్లు తెలుస్తోంది.
గద్దర్ అవార్డులను ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు విడుదలైన తెలుగు, ఉర్దూ చిత్రాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అందజేయనుంది. 2024 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా 'కల్కి 2898 ఏడీ', ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ('పుష్ప 2'), ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరవుతారని సమాచారం.






