- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యాశాఖలో తాత్కాలిక ఉద్యోగుల సేవలు కొనసాగింపు
రాష్ట్రంలో పాఠశాల విద్య, విద్యా పరిశోధనా శిక్షణా మండలి (ఎస్ సీఈఆర్ టీ) ఆధ్యర్యంలో ఉన్న 239 మంది తాత్కాలిక ఉద్యోగుల సేవలను కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పాఠశాల విద్య, విద్యా పరిశోధనా శిక్షణా మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్యర్యంలో ఉన్న 239 మంది తాత్కాలిక ఉద్యోగుల సేవలను కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 28 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కాగా, 211 మంది గెస్ట్ అధ్యాపకులు ఉన్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 వరకు లేదా సాధారణ ఉద్యోగుల భర్తీ అయ్యే వరకు కొనసాగుతాయి. ఈ సేవలకు చెల్లించే జీతాలు ఐఎఫ్ఎంఐఎస్ -డీబీటీ పద్ధతి ద్వారా గెస్ట్ సర్వీసుల వారికి, థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా ఔట్‌సోర్సింగ్ వారికి చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ నియామకాలకు అయ్యే ఖర్చును వివిధ హెడ్ ఆఫ్ అకౌంట్ల నుంచి చెల్లిస్తారు. పాఠశాల విద్య విభాగం ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు.
జిల్లా వారీగా నియామక వివరాలు:
ఖమ్మం డైట్ కార్యాయలంలో 8 మంది కరిక్యులర్ గెస్ట్ ఫ్యాకల్టీని రూ.23,400 నెలవారీ పారితోషికంతో నియమిస్తారు. అలాగే, ఇద్దరు కో-కరిక్యులర్ గెస్ట్ ఫ్యాకల్టీకి రూ.15,600 పారితోషికం లభిస్తుంది. నల్గొండ డైట్ కార్యాలయంలో 8 మంది కరిక్యులర్ గెస్ట్ ఫ్యాకల్టీకి రూ.23,400, ఇద్దరు కో కరిక్యులర్ గెస్ట్ ఫ్యాకల్టీకి రూ.15,600 చొప్పున వేతనం చెల్లిస్తారు. అలాగే మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ సీటీఈలలో 11 మంది కరిక్యులర్ గెస్ట్ ఫ్యాకల్టీకి రూ.23,400, ముగ్గురు కో కరిక్యులర్ గెస్ట్ ఫ్యాకల్టీకి రూ.15,600 చెల్లిస్తారు. అలాగే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ) లో 18 మంది కరిక్యులర్ గెస్ట్ ఫ్యాకల్టీకి రూ.23,400, నలుగురు కోకరిక్యులర్ గెస్ట్ ఫ్యాకల్టీకి రూ.15,600 వేతనం చెల్లిస్తున్నారు.






