అమెజాన్‌, బోట్ కంపెనీల‌పై సామాన్యుడి విజయం

by Bhanu |

సాధారణ వినియోగదారుడిగా ప్రారంభమైన ఓ వ్యక్తి న్యాయపోరాటంలో దిగ్గజ సంస్థలైన అమెజాన్‌, బోట్‌పై విజయం సాధించాడు.

అమెజాన్‌, బోట్ కంపెనీల‌పై సామాన్యుడి విజయం
X

దిశ, హిమాయత్ నగర్: సాధారణ వినియోగదారుడిగా ప్రారంభమైన ఓ వ్యక్తి న్యాయపోరాటంలో దిగ్గజ సంస్థలైన అమెజాన్‌, బోట్‌పై విజయం సాధించాడు. సేవా లోపం, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కఠినంగా పోరాడిన గజ్జెల శ్రీనివాస్ అనే వ్యక్తి, చివరకు హైదరాబాదులోని జిల్లా వినియోగదారుల తగాదా పరిష్కార ఫోరమ్ (కన్సూమర్ కోర్టు) ద్వారా న్యాయం పొందాడు.

2024 జనవరి 18న శ్రీనివాస్‌ అమెజాన్‌ ప్లాట్‌ఫాం ద్వారా బోట్ సంస్థకు చెందిన ₹19,999 విలువ చేసే 5500DA సౌండ్‌బార్ కొనుగోలు చేశాడు. కానీ సదరు ప్రోడక్ట్ సరిగా పనిచేయకపోవడంతో, మళ్ళీ మార్చించుకునేందుకు నాలుగు నెలలు పాటు కస్టమర్ కేర్‌ను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి "ఏం చేయగలవో చేసుకోండి" అన్నట్టు వ్యవహరించిన సంస్థలపై శ్రీనివాస్ కోర్టులో కేసు వేశారు.

వాదనలు, ఆధారాల తర్వాత కోర్టు బాధితుడికి పూర్తి న్యాయం చేసింది. ఉత్పత్తి విలువతో పాటు ₹10,000 నష్ట పరిహారం, ₹5,000 కోర్టు ఖర్చులతో కలిపి మొత్తం ₹35,000 మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని అమెజాన్‌, బోట్ సంస్థలకు ఆదేశించింది.

శ్రీనివాస్ స్పందన: "న్యాయం ఆలస్యం కావొచ్చు కానీ వస్తుంది. ప్రతీ వినియోగదారుడు ధైర్యంగా ముందుకు వచ్చి తమ హక్కుల కోసం పోరాడాలి," అని ఆయన వెల్లడించారు. ఈ సంఘటన కంపెనీల నిర్లక్ష్యానికి చెక్ పడేలా ఉన్నదని, ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.


Next Story