‘క్యూర్‌’ పరిధిలో లక్ష ఫ్లాట్ల నిర్మాణం.. గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-29 09:25:16  IST  )

హైదరాబాద్‌లో క్యూర్‌ స్కీమ్ కింద లక్ష ఫ్లాట్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

‘క్యూర్‌’ పరిధిలో లక్ష ఫ్లాట్ల నిర్మాణం.. గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహానగర పరిధిలోని దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేసేలా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ‘క్యూర్‌’ (Core Urban Region Economy) పరిధిలో అందుబాటు ధరల్లో ఫ్లాట్ల నిర్మాణానికి గృహనిర్మాణ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా లో-ఇన్‌కమ్ గ్రూప్ (LIG), మిడిల్-ఇన్‌కమ్ గ్రూప్ (MIG) ఫ్లాట్లను నిర్మించేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద అర్హులైన దిగువ, మధ్య తరగతి ప్రజల కోసం మొత్తంగా ఒక లక్ష ఫ్లాట్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, దీనిని దశలవారీగా చేపట్టనున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత ‘పైలట్ ప్రాజెక్ట్’ కింద 12 వేల ఫ్లాట్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు హౌసింగ్ బోర్డుకు అనుమతులు మంజూరు చేశారు.

ఎల్‌ఐజీ ఫ్లాట్లకు రూ.5 లక్షల సబ్సిడీ

ఈ ప్రాజెక్టులో అత్యంత నిరుపేదలు, దిగువ వర్గాల వారికి లబ్ధి చేకూర్చేలా ఎల్‌ఐజీ (LIG) ఫ్లాట్లకు భూమి యూడీఎస్ (Undivided Share of Land) ఇవ్వడంతో పాటు, అదనంగా రూ.5 లక్షల ఆర్థిక సబ్సిడీని కూడా ప్రభుత్వం అందించనుంది. తద్వారా సామాన్యుడికి సైతం ఫ్లాట్ కొనుగోలు భారం తగ్గుతుంది.

Next Story