- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తుల నిర్మాణం.. చర్యలు శూన్యం
అనుమతులకు విరుద్ధంగా చేపడుతున్న అదనపు అంతస్తుల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని సర్కిల్ కార్యాలయ ఇన్ వార్డు, ప్రజావాణి కార్యక్రమాలలో పిటిషన్‌లు దాఖలు చేసి,

దిశ, పేట్ బషీరాబాద్ : అనుమతులకు విరుద్ధంగా చేపడుతున్న అదనపు అంతస్తుల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని సర్కిల్ కార్యాలయ ఇన్ వార్డు, ప్రజావాణి కార్యక్రమాలలో పిటిషన్‌లు దాఖలు చేసి, తీసుకున్న చర్యలపై ఆర్టీఏ ద్వారా సమాచారం కోరినా.. కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నుంచి ఏమాత్రం స్పందన లేకపోవడంతో ఫిర్యాదుదారుడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు.
పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ..
కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్ నగర్ డివిజన్ గంపల బస్తి, జీడిమెట్ల గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 245లోని రామావత్ పాఠశాల ఎదుట సర్వే నంబర్ 244, 316, 315 పరిధిలోకి వచ్చే ఇంటి నంబరు 07–605/9/153 ప్లాట్లులో ఓ వ్యక్తి జిప్లస్ త్రీ అనుమతులు తీసుకొని, మరో నాలుగు అంతస్తులు అదనంగా వేస్తున్నాడని పలుమార్లు జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు స్థానికుడు తెలిపారు. అదేవిధంగా ప్రజావాణిలో సైతం ఫిర్యాదులు అందాయి. మే నెల మొదటి వారంలో ఫిర్యాదుదారుడు సదరు అక్రమ నిర్మాణంపై తీసుకున్న చర్యలపై సమాచారం కోరుతూ ఆర్టీఏ దరఖాస్తులు దాఖలు చేశారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ దరఖాస్తుకు సమాధానంగా కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ నరసింహ రామావత్ స్కూల్ ఎదురుగా జరుగుతున్న భవనానికి జి ప్లస్ త్రీ అనుమతులు తీసుకున్నారని, అయితే అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారని అందుకు అప్పటికే నోటీసులు జారీ చేశామని తెలుపుతూ దరఖాస్తుదారుడికి సమాచారాన్ని అందజేశారు. ఫిర్యాదులు, ప్రజావాణిలో అర్జీలు, సమాచార హక్కు చట్టం ద్వారా అక్రమ నిర్మాణాన్ని డిప్యూటీ కమిషనర్ నరసింహ, టౌన్ ప్లానింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిర్మాణ పనులు ఆగలేదని సమాచారం.
కోర్టును ఆశ్రయించినప్పటికి..
కుత్బుల్లాపూర్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారుల తీర్పుతో విసిగిపోయిన ఫిర్యాదుదారుడు తాను చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్, అక్రమ నిర్మాణ భవనదారుడుని ప్రతివాదులుగా కోరుకుంటూ సెప్టెంబర్ 3వ వారంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ ఆఖరి వారం, జూలై రెండవ వారం, ఆగస్టు మూడో వారంలో అక్రమ భవన నిర్మాణంపై తాను చేసిన అర్జీలను పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా, కోర్టును ఆశ్రయించిన నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని, అందుకు కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నరసింహ, టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైకోర్టు ఆర్డర్‌కు విలువేది..?
షేక్‌పేట్ ఓయూ కాలనీలో అక్రమ భవన నిర్మాణదారుడు కోర్టును ఆశ్రయించిన సందర్భంలో కోర్టు జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలపై షోకాస్ నోటీసులు జారీ చేసి, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థంకావటం లేదని, షోకాజ్ నోటీస్ జారీ చేసిన తర్వాత పనులు ఆపివేయడం, సీల్ వేయటం జరగాలని వ్యాఖ్యానించింది. షోకాజ్ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా నిర్మాణాలు కొనసాగటం ఆశ్చర్యం కలిగిస్తుందని పేర్కొంది. ఇకముందు జీహెచ్ఎంసీ అనధికారిక నిర్మాణాలు, అంతస్తులు గుర్తించబడిన వెంటనే షోకాస్ నోటీసు జారీ చేసి విచారణ కొనసాగుతున్నంత వరకు వాటిని సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ ఉత్తర్వులను కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాటించే విధంగా తగిన సూచనలు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల అనుసారం 2025 మే 2న జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉన్న 30 సర్కిళ్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఎస్‌టీఎఫ్ అధికారులకు కమిషనర్ సర్య్కులర్ జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన చేపడుతున్న నిర్మాణాలను సీజ్ చేయాలని ఆ సర్క్యులర్ సారాంశం. అయితే ఈ సర్కులర్ జారీ అయిన కొద్ది రోజుల్లో పై రామావత్ స్కూల్ ఎదురుగా జరుగుతున్న అక్రమ నిర్మాణం పై ఫిర్యాదులు అందినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం షోకాస్ నోటీసులు జారీ చేసి మామ అనిపించడంతో అక్రమ నిర్మాణం తత్వరికంగా పూర్తయ్యే విధంగా కొనసాగుతుందని, హైకోర్టు ఆదేశాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా ఒక్క ఈ నిర్మాణం మాత్రమే కాదు కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు డివిజన్ లలో తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా ఎడాపెడా నిర్మాణాలు జరగడమే కాకుండా అసలు ఏ మాత్రం అనుమతులు తీసుకోకుండా కూడా నిర్మాణాలు యదేచ్చగా కొనసాగుతున్నాయనేది వాస్తవం.






