పవన్ కల్యాణ్ చొరవ.. కొండగట్టులో 96 గదుల నిర్మాణం: బండి సంజయ్

by Gantepaka Srikanth |

పవన్ కల్యాణ్ చొరవ.. కొండగట్టులో 96 గదుల నిర్మాణం: బండి సంజయ్

పవన్ కల్యాణ్ చొరవ.. కొండగట్టులో 96 గదుల నిర్మాణం: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుల కోసం 96 గదుల సత్రం నిర్మాణానికి ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సిఫార్సుతో టీటీడీ రూ.35.19 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అంజన్న ఆలయ గదుల నిర్మాణం కోసం టీటీడీ రూ.35 కోట్లు కేటాయించడం హర్షనీయమని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండగట్టు ఆలయానికి రూ.100 కోట్లు ఇస్తామని నయాపైసా ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొండగట్టుకు చిల్లి గవ్వ ఇవ్వక పోగా ఆర్జిత సేవల ఛార్జీల పెంపు పేరుతో భక్తులపై భారం మోపిందని మండిపడ్డారు. భక్తులకు కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ పట్టించుకోలేదని అన్నారు. దేవాలయాలపై ప్రేమ ఒలకపోస్తున్న కాంగ్రెస్ పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొండగట్టు ఆలయానికి నిధులు కేటాయించి అన్ని విధాలా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

Next Story