మీనాక్షి నటరాజన్‌ దూకుడు! కొనసాగుతున్న సమీక్షలు.. నేతల మధ్య విభేదాలపై ఆరా..?

by Ramesh Naini |

తెలంగాణలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ దూకుడు పెంచారు.

మీనాక్షి నటరాజన్‌ దూకుడు! కొనసాగుతున్న సమీక్షలు.. నేతల మధ్య విభేదాలపై ఆరా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పార్టీ బలోపేతంపై (Congress) కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) దూకుడు పెంచారు. నియోజకవర్గాల వారీగా మీనాక్షి నటరాజన్ పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నేడు వరంగల్, నాగర్‌కర్నూల్, సికింద్రాబాద్ నియోజకవర్గాల వారీగా నాయకులతో ఆమె మీటింగ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కార్యక్రమం కొనసాగుతున్నది. కార్పోరేషన్ చైర్మన్‌లు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మీనాక్షి సమావేశం అయ్యారు.

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా సూచనలు..

అధికార పార్టీ నేతల్లో ఉన్న పొరపొచ్చాలు, వారి మధ్య నెలకొన్న సమస్యలను మేడం సరిదిద్దే పనిలో పడ్డారు. ఇవాళ సాయంత్రం చైర్మన్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల ముందు వరుస మీటింగ్స్ నిర్వహించడం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రం జరిగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ నాయకులకు పలు సూచనలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని లోకల్‌గా ఉన్న సమస్యలపై ఆరా తీస్తున్నారు. అదేవిధంగా పార్టీలో మంత్రి విస్తరణ, ఇతర పదవుల భర్తీ పై నేతల ఎలిజిబిలిటీ, పర్ఫామెన్స్ గురించి కూడా మీనాక్షి అడిగి తెలుసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

నేతల మధ్య నెలకొన్న విభేదాలు?

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ క్యాడర్ తో భేటీ అవుతూ వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, పార్టీ బలోపేతానికి ఇంకా ఏమేం చేస్తే బాగుంటుంది. రాష్ట్ర సర్కార్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి.. వాటిపై ప్రజల అభిప్రాయాలేంటి అనే వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు ఆయా ప్రాంతాల్లోని నేతల మధ్య నెలకొన్న విభేదాలు ఏమిటి, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాలని చర్యలు ఏంటని సమావేశాల ద్వారా మీనాక్షి నటరాజన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ కాలంలో ప్రభుత్వంపై వస్తున్న నెగెటివ్ టాక్‌పై కూడా ఆమె ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Next Story