కానిస్టేబుల్ అభ్యర్థులు అలర్ట్.. ఇవాళ్టి నుంచి హాల్ టికెట్లు విడుదల

by Disha Web Desk 2 |
కానిస్టేబుల్ అభ్యర్థులు అలర్ట్.. ఇవాళ్టి నుంచి హాల్ టికెట్లు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్‌: తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 28వ తేదీన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష జరుగనున్న విషయం తెలిసిందే. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించనున్న ప్రిలిమినరీ ఎగ్జామ్ హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్‌డేట్ విడుదల చేసింది. ఆగస్టు 28న పరీక్ష జరుగనుండగా.. ఇవాళ్టి(ఆగస్టు 18వ తేదీనుంచి) అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని పేర్కొంది. ఆగస్టు 18 ఉదయం 8 నుంచి ఆగస్టు 26 అర్థరాత్రి 12 గంటల వరకు TSLPRB వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులు తమ తమ హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది TSLPRB. ఈ హాల్ టికెట్లకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నా, హాల్ టికెట్ డౌన్‌లోడ్ అవకపోయినా.. [email protected] కి మెయిల్ చేయడం గానీ, 93937 11110, 93910 05006 నెంబర్లకు కాల్ చేయడం గానీ చేయొచ్చని TSLPRB పేర్కొంది. కాగా, 28న (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగనుంది. ఇక కానిస్టేబుల్ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

TS ఎస్ఐ అభ్యర్థులకు శుభవార్త.. ఫలితాలు అప్పుడే?

Next Story

Most Viewed