- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొలంలో నీళ్ళు తాగినందుకు గొర్రెల కాపరిని చితకబాదిన కానిస్టేబుల్
తన పొలంలో నీళ్ళు తాగినందుకు గొర్రెల కాపరిని ఓ కానిస్టేబుల్ చితకబాదాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని పోలీస్ స్టేషన్‌లో విధులు

దిశ, వెబ్ డెస్క్: తన పొలంలో నీళ్ళు తాగినందుకు గొర్రెల కాపరిని ఓ కానిస్టేబుల్ చితకబాదాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ లింగం నాయక్ అదే పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. లింగం నాయక్ పొలం చుట్టుపక్కల గొర్రెలను మేపుతున్న ప్రవీణ్ అనే కుర్రాడు దాహం వేయడంతో పొలానికి వెళ్లి మోటార్ ఆన్ చేసి నీళ్లు తాగాడు. దీంతో తన పర్మిషన్ లేకుండా నీళ్లు ఎలా తాగుతావు అంటూ కానిస్టేబుల్ ప్రవీణ్ పై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడు. తనపై దాడి చేయడంతో పాటూ తన తల్లి అడ్డుగా వచ్చినందుకు ఆమెపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించాడని బాధితుడు చెబుతున్నాడు. పొలంలో పంట కూడా లేదని అన్నారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, పిలిపించి మాట్లాడతామని చెప్పి పిలవలేదని అన్నారు.






