- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర.. కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్
జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని.. వికసిత భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్‌గా పేరు మార్చి గాంధీజీ పేరును తొలగించడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్ అయిన ఉపాధి హామీ పథకాన్ని చంపేందుకు కుట్ర చేస్తోందన్నారు. చట్టంలో సంస్కరణలు గొప్పవి అయితే రాష్ట్రాలతో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో హడావిడిగా బిల్లు ఎందుకు తెస్తున్నారని, తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఉపాధి హామీకి నిధుల్లో కోతలు విధిస్తూ కుంటిసాకులు చెబుతున్నారని మంత్రి పొన్నం అన్నారు. గాంధీ పేరు తొలగించడం ద్వారా ఆయనను అవమానిస్తున్నారని ఆరోపించారు. అందుకే వారికి గాడ్సే వారసులుగా పేరు ఉందన్నారు. కరోనా సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. కానీ, ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు కూడా ఉపాధి హామీ తీసుకొచ్చే బదులు, ఉన్నది తొలగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం రాష్ట్రాలకు రావాల్సిన నిధులు విడుదల చేయకుండా సెస్ పేరుతో దోచుకుంటోందని ఆరోపించారు. జీఎస్టీ ద్వారా రాష్ట్రాల స్వేచ్ఛను లాగేస్తోందని అన్నారు. ఈ పరిణామాలు ఫెడరల్ స్ఫూర్తిని చంపే ప్రయత్నమని.. అన్ని కుట్రలపై పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ప్రతిష్టాత్మక ఉపాధి హామీ చట్టాన్ని నికిల్ దే, అరుణ రాయ్, హరగోపాల్, శాంత సిన్హా లాంటి మేధావులతో చర్చించి కాంగ్రెస్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త బిల్లు ప్రకారం పని రోజులు 100 నుంచి 125కి పెంచినప్పటికీ, నిధుల భారం రాష్ట్రాలపై మోపడం, డిమాండ్ బేస్డ్ నుంచి సప్లై బేస్డ్‌గా మార్చడం వంటి మార్పులపై విమర్శలు వస్తున్నాయని అన్నారు. ఈ బిల్లు పట్టణ పేదరికాన్ని పోగొట్టేందుకు బదులు గ్రామీణ ఉపాధిని బలహీనపరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు.






