- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao : పథకాల్లో కోతలకే కాంగ్రెస్ ప్రయత్నాలు : హరీష్ రావు
అడ్డగోలు కొర్రీలు..మార్గదర్శకాల పేరుతో సంక్షేమ పథకా(Welfare Schemes)ల్లో కోతలకే కాంగ్రెస్(Congress) ప్రయత్నం చేస్తుందని..ఎన్నికల కోసం ఇచ్చిన హామీల అమలులో ప్రజలను మోసం చేయాలని చూస్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : అడ్డగోలు కొర్రీలు..మార్గదర్శకాల పేరుతో సంక్షేమ పథకా(Welfare Schemes)ల్లో కోతలకే కాంగ్రెస్(Congress) ప్రయత్నం చేస్తుందని..ఎన్నికల కోసం ఇచ్చిన హామీల అమలులో ప్రజలను మోసం చేయాలని చూస్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) విమర్శించారు. ప్రతిపక్షం నిలదీస్తే గానీ, ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన బీఆర్ఎస్ విజయమేనని..మీ సేవా దరఖాస్తులు కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని..దరఖాస్తులు చేసుకోవడం నిరంతర ప్రక్రియ అని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
పెరిగిన ద్రవ్యోల్బణం ఆధారంగా రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి పెంచాలని మరోసారి డిమాండ్ చేస్తున్నామని, ప్రజలను మోసం చేయాలని చూసిన ప్రతిసారి, మేము మిమ్మల్ని ప్రశ్నిస్తుంటాం, నిలదీస్తూనే ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. పేదలకు రేషన్ కార్డులు అందకుండా చేస్తున్నారని, కోతలు విధిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడంతో పాటు, పత్రికా సమావేశం నిర్వహించి నిలదీస్తే గాని ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కాలేదన్నారు.
కుల గణన దరఖాస్తులతోపాటు, ప్రజాపాలన దరఖాస్తులకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం, ఇది తుది జాబితా కాదని, దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చెప్పించడం బీఆర్ఎస్ విజయమని పేర్కొన్నారు. ఆదాయ పెంపు విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండటం వల్ల లక్షల మంది నిరుపేద వర్గాలు రేషన్ కార్డులకు దూరం అవుతాయని మరొక్క సారి గుర్తు చేస్తున్నామన్నారు. కేసీఆర్ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు పొందేందుకు వీలుగా ఆదాయ, భూ పరిమితి నిబంధనల్లో మార్పులు చేశారన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదాయ పరిమితి గ్రామీణంలో 60వేలు, పట్టణంలో 75వేలు ఉంటే, దాన్ని గ్రామీణంలో లక్షా 50వేలకు, పట్టణంలో 2.50 లక్షలకు పెంచారన్నారు. మాగాణి రెండున్నర ఎకరాలు, మెట్ట 5ఎకరాలుగా ఉన్న పరిమితిని మాగాణి మూడున్నరకు, మెట్ట ఏడున్నర ఎకరాలకు పెంచారని విమర్శించారు. దీనివల్ల లక్షల మంది నిరుపేదలకు రేషన్ కార్డు పొందే అర్హతను కేసీఆర్ ప్రభుత్వం కల్పించిందన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయ పరిమితి తోపాటు భూ పరిమితి పెంచుతూ నిబంధనల్లో మార్పు చేయాలని తెలంగాణ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నామన్నారు. తద్వారా ఆశాలు, అంగన్వాడీలు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టులు.. ఇతర అల్ప ఆదాయ వర్గాలు, పెదాలు రేషన్ కార్డులు పొందే వీలు ఉంటుందని స్పష్టం చేస్తున్నామని తెలిపారు.
పల్లెల్లో అయినా పట్టణంలో అయినా కూలీ ఎక్కడైనా నిరుపేదేనని.. కాబట్టి పల్లెలు పట్టణాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని, 20 రోజుల పనిదినాల నిబంధన తొలగించాలని, భరోసా పథకాన్ని ఉపాధి హామీకి లింకు చేయకుండా అర్హులైన అందరికీ వర్తింప చేయాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. నిరుపేదలకు ఆసరాగా ఉండే రేషన్ కార్డు జారీ ప్రక్రియలో ప్రభుత్వం కోతలు విధించడం సరికాదని హరీష్ రావు హితవు పలికారు.






