కాంగ్రెస్ యువ పోరాట యాత్ర.. రేపటి నుంచి షురూ

by Dishafeatures2 |
కాంగ్రెస్ యువ పోరాట యాత్ర.. రేపటి నుంచి షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ యువ పోరాట యాత్ర రేపటి నుంచి మొదలు కానున్నది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సెగ్మెంట్ గజ్వేల్​నుంచి ప్రారంభించనున్నారు. 33 జిల్లాల్లో 33 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనున్నది. యూత్ కాంగ్రెస్​ఆధ్వర్యంలో ఈ యాత్ర జరగనున్నది. ఈ సందర్భంగా యూత్​కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత అల్లాడుతున్నారన్నారు. నిరుద్యోగులు టీఎస్​పీఎస్సీని దేవాలయంగా భావిస్తారని, కానీ అలాంటి బోర్డు నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతుందన్నారు. ప్రతిసారి నిర్లక్ష్యంతో విద్యార్ధులు, నిరుద్యోగులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.

టీఎస్​పీఎస్సీనీ కేసీఆర్​బ్రోతల్ కంపెనీగా మార్చారన్నారు.కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చి, రెగ్యులర్​జాబ్స్​ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందన్నారు. ఇంత కంటే మోసం మరోకటి ఉండదన్నారు. ఇక ప్రభుత్వం కొత్తగా కట్టిన కలెక్టర్​కార్యాలయాల్లో ఉద్యోగులు లేక ఖాళీలు వెక్కిరిస్తున్నాయన్నారు. కేసీఆర్​ హామీ ఇచ్చిన ప్రకారం ఇప్పటి వరకు ప్రతి నిరుద్యోగికి ప్రభుత్వ లక్షా అరవై వేల బకాయి లు ఉన్నదన్నారు. ప్రజలకు ఈ విషయం అర్థమయ్యే రీతిలో వివరించేందుకే ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగం, ఉపాధి, కమీషన్లు, ప్రభుత్వ వైఫల్యాలను ఈ యాత్రలో వివరిస్తామన్నారు.

Next Story

Most Viewed