అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు...ఒకరు మృతి

by Sridhar Babu |
అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు...ఒకరు మృతి
X

దిశ, చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండలం మందాపూర్ గ్రామ శివారులోని రాంజీ తండా వద్ద మెదక్ - చేగుంట రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు మెదక్ వైపు వెళ్తున్న కారు రోడ్డు పై అదుపుతప్పి పల్టీలు కొట్టి అందులోని ఒక వ్యక్తి రోడ్డుపై పడి తల పగిలి చనిపోయాడు. మరో ముగ్గురు కారులో ఇరుక్కుపోగా ఎవరూ వారిని బయటకు తీయటానికి ముందుకు రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్తున్న జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పరిశీలించి వెంటనే వారిని వ్యక్తిగత సిబ్బంది సహాయంతో బయటకు తీయించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. గాయపడ్డ ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతి చెందిన వ్యక్తిని మెదక్ ఆసుపత్రికి తరలించారు.

Next Story